Ram Charan: రామ్ చరణ్ ఇంట్లో బాలీవుడ్ స్టార్స్ సందడి చూశారా?

  • June 29, 2022 / 10:13 AM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ మెల్లమెల్లగా బాలీవుడ్లో కూడా ఫేమస్ అవ్వాలని చూస్తున్నాడు. ‘జంజీర్’ టైంలోనే బాలీవుడ్ లో ఫాలోయింగ్ కోసం ట్రై చేశాడు. ఆ సినిమాకి సల్మాన్ ఖాన్ హెల్ప్ తీసుకున్నాడు. ముంబైలోనే ఎక్కువ కాలం ఉంటూ వచ్చాడు. ఆ సినిమా చేస్తున్న టైంలో తెలుగు సినిమాలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు అనే విమర్శలు కూడా అతని పై వచ్చేవి. అయితే ‘జంజీర్’ డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా తెలుగులో కలెక్ట్ చేసిన కలెక్షన్స్ చాలా దారుణం అనుకుంటే అందులో సగానికి సగం కూడా బాలీవుడ్లో కలెక్ట్ చేయలేకపోయింది.

దాంతో బాలీవుడ్ పై ఆశలు వదులుకున్న రాంచరణ్ కు ‘ఆర్.ఆర్.ఆర్’ మళ్ళీ బాలీవుడ్ పై మోజు పెరిగేలా చేసింది. ఈ మధ్య కాలంలో ఛాన్స్ దొరికితే నార్త్ వెళ్లి ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్నాడు. అక్కడి దర్గాలకి వెళ్తున్నాడు. ప్రముఖుల్ని కలుస్తున్నాడు. ఒక్కటేంటి హిందీ న్యూస్ పేపర్స్ లో వార్తల్లో రావడానికి ఏం చెయ్యాలో అన్నీ చేస్తున్నాడు.ఇక షూటింగ్ నిమిత్తం ఏ బాలీవుడ్ స్టార్ అయినా హైదరాబాద్ వస్తే.. అస్సలు విడిచిపెట్టడం లేదు.

వాళ్ళను తన ఇంటికి డిన్నర్ కు ఆహ్వానించడం, ఫోటోలు తీసి వైరల్ అయ్యేలా చేయడం వంటివి చేస్తున్నారు. మొన్ననే ‘కబీ ఈద్ కబీ దివాలీ’ సినిమా షూటింగ్ కోసం సల్మాన్ ఖాన్ వస్తే అతన్ని తన ఇంటికి డిన్నర్ కు ఆహ్వానించాడు చరణ్.ఆ సినిమాలో చరణ్ కూడా చిన్న కేమియో ఇస్తున్నాడు కదా. అతనితో పాటు పూజా హెగ్డే కూడా రామ్ చరణ్ ఇంటికి వచ్చింది.

ఈ ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా ఆమిర్ ఖాన్ ఫోటోని కూడా షేర్ చేసింది. సల్మాన్ మాత్రమే కాదు ఆమిర్ కూడా తమ ఇంటికి వచ్చాడని తమ పెంపుడు కుక్క పిల్ల రైమ్ ను చూసి ఇష్టపడ్డారని.. ఉపాసన చెప్పుకొచ్చింది. వరుసగా ఇలా బాలీవుడ్ స్టార్లు చరణ్ ఇంటికి వెళ్తుండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus