Pushpa Movie: లెక్కల మాస్టారు ఈ చిన్న లాజిక్స్ ఎలా మర్చిపోయాడు..!

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 3వ చిత్రం ‘పుష్ప’. డిసెంబర్ 17న రిలీజ్ అయిన ఈ చిత్రం మొదట డివైడ్ టాక్ ను మూటకట్టుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేసింది. ముఖ్యంగా పక్క రాష్ట్రాల బయ్యర్లకు ఈ చిత్రం లాభాలను అందించింది.ఆంధ్ర బయ్యర్లు మాత్రం భారీగా నష్టపోయారు. అయితే వారు నష్టపోయిన మొత్తాన్ని చెప్పించడానికి నిర్మాతలు అంగీకరించారు లెండి. అలా చూసుకుంటే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అనే చెప్పాలి.

ఇదిలా ఉండగా.. పుష్ప లో అల్లు అర్జున్ పాత్ర ఓ కూలీగా తన జీవితాన్ని మొదలు పెట్టి సిండికేట్ మెంబర్ గా ఎలా ఎదిగింది అనే థీమ్ తో ఈ చిత్రం తెరకెక్కింది. మాస్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అల్లు అర్జున్ ఉన్నాడు కాబట్టి క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ చిత్రాన్ని బాగానే చూసారు. ఇదిలా ఉండగా.. ‘వెన్ లాజిక్ డైస్.. ది రియల్ మూవీ స్టార్ట్స్’ అంటూ కొంతమంది స్టార్ దర్శకులు గతంలో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

అయితే పెద్ద సినిమాలకి లాజిక్ లు వెతకడం మన తెలుగు ప్రేక్షకులకి అలవాటే. అదే విధంగా ‘పుష్ప’ సినిమాలో కూడా కొన్ని లాజిక్ లెస్ సీన్స్ ను కనిపెట్టి సోషల్ మీడియాలో డిస్కషన్లు మొదలుపెట్టారు మన నెటిజన్లు. అవేంటి అంటే… ‘పుష్ప’ లో ఓ సీన్ లో పుష్ప రాజ్ మరియు అతని అసిస్టెంట్ కేశవ ఓ కార్లో డోర్ తీయడానికి నానా కష్టాలు పడతారు. ముఖ్యంగా కేశవ పాత్ర డోర్ తీసుకుని కిందికి దిగడానికి ఇబ్బంది పడుతుంది. కానీ నెక్స్ట్ సీన్ కు అతను కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చినట్టు చూపించారు.

ఇక సినిమా ప్రారంభంలో పోలీసులు పుష్ప రాజ్ అండ్ బ్యాచ్ ను చుట్టుముట్టినప్పుడు ఎర్రచందనం దుంగలు చెట్ల పై ఉంటాయి. వాటిని పోలీసులు చూడరు. అంతేకాదు తర్వాతి సన్నివేశంలో పుష్ప రాజ్ లారీని ఓ నుయ్యిలో పడేస్తాడు. ఆ లారీ పడేసేముందు కూడా దాని సౌండ్ పోలీసులకి వినపడదు. పైగా అన్ని చోట్లా చెక్ చేసినట్టు వాళ్ళు చెబుతారు. ఈ లాజిక్ లు అన్నీ సినిమా ఫలితానికి ఆటంకాలు కలిగించలేదు. అది దర్శకుడు, హీరో పై ఉన్న ఇష్టం వల్ల కావచ్చు.!

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus