ఈ ఏడాది ఈ 10 మంది హీరోయిన్లకు పెద్ద షాక్ తగిలిందిగా..!

2022 లో సౌత్ సినిమా స్థాయి పెరిగింది. నార్త్ ఆడియన్స్ అంతా సౌత్ సినిమాల కోసం ఆతృతగా ఎదురు చూసేలా చేసింది. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ ‘ఆర్.ఆర్.ఆర్’ ‘కార్తికేయ 2’ ‘కాంతార’ వంటి సినిమాలు నార్త్ లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. భారీ కలెక్షన్స్ సాధించాయి. యష్, ఎన్టీఆర్, రాంచరణ్, రిషబ్ శెట్టి వంటి హీరోలకు అక్కడ భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే స్టార్ హీరోలకు, స్టార్ హీరోయిన్లకు ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు అనే చెప్పాలి. ముఖ్యంగా చాలా మంది స్టార్ హీరోయిన్లకు ఈ ఏడాది ఎక్కువగా ప్లాపులే పలకరించాయి. ఆ హీరోయిన్లు ఎవరో.. వాళ్ళు నటించిన ప్లాప్ సినిమాలు ఏంటో ఆలస్యం చేయకుండా ఓ లుక్కేద్దాం రండి :

1) పూజా హెగ్డే :

పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ ను సొంతం చేసుకున్న మన బుట్టబొమ్మ.. ఈ ఏడాది పెద్దగా రాణించలేకపోయింది. ఆమె నుండి ఈ ఏడాది వచ్చిన ‘రాధే శ్యామ్’ ‘బీస్ట్’ ‘ఆచార్య’ వంటి చిత్రాలు పెద్ద డిజాస్టర్లుగా మిగిలాయి. ఈమె హిందీలో నటించిన ‘సర్కస్’ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది. సో ఈ ఏడాది ఆమెకు ఏమాత్రం కలిసి రాలేదు అనే చెప్పాలి. 2023 లో ఆమె మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 2023 లో అయినా ఈమెకు సక్సెస్ బాట పడుతుందేమో చూడాలి.

2) రష్మిక మందన :

ఈమె తెలుగులో నటించిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’, హిందీలో నటించిన ‘గుడ్ బై’ వంటి సినిమాలు నిరాశపరిచాయి. ‘సీతా రామం’ హిట్ అయినా అందులో ఈమె హీరోయిన్ కాదు పైగా ఆ సినిమా ద్వారా మృణాల్ ఠాకూర్ హైలెట్ అయ్యింది. ఆమెకే పేరొచ్చింది. ప్రస్తుతం ఆమె ‘పుష్ప 2’ లో నటిస్తుంది.

3) సమంత :

‘కన్మణి ఖతీజా రాంబో'(కె.ఆర్.కె) … కాతు వాకుల రెండు కాదల్.. మూవీలో సమంత నటించింది. ఈ మూవీ ప్లాప్ అయ్యింది.

4) తమన్నా :

ప్లాన్ ఎ ప్లాన్ బి, బబ్లీ బౌన్సర్, గుర్తుందా శీతాకాలం.. ఇలా 3 ప్లాపులు మూటగట్టుకుంది ఈ బ్యూటీ.

5) సాయి పల్లవి :

‘విరాట పర్వం’ ‘గార్గి’ .. సాయి పల్లవి నటించిన ఈ రెండు సినిమాలకు మంచి టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ప్లాప్స్ గా మిగిలాయి.

6) శ్రీనిధి శెట్టి :

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రాలతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగిన ఈమెకు విక్రమ్ తో చేసిన ‘కోబ్రా’ మూవీ పెద్ద షాక్ ఇచ్చింది.

7) తాప్సీ పన్ను :

‘మిషన్ ఇంపాజిబుల్’ ఈమె హిందీలో నటించిన మరో 3 సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఈమెకు కూడా ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదు.

8) కాజల్ అగర్వాల్ :

దుల్కర్ సల్మాన్ తో ఈమె నటించిన ‘హే సినామిక’ చిత్రం పెద్ద ప్లాప్ అయ్యింది. ‘ఆచార్య’ సినిమాలో అయితే ఈమె పాత్రనే తీసేశారు. ఈ ఏడాది కాజల్ కు ఏమాత్రం కలిసి రాలేదు.

9) కృతి శెట్టి :

హ్యాట్రిక్ హిట్లు కొట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈమె ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ‘ది వారియర్’ ‘మాచర్ల నియోజకవర్గం’ వంటి చిత్రాలతో 3 డిజాస్టర్లు మూటగట్టుకుంది.

10) రాశీ ఖన్నా :

ఈమె తెలుగులో నటించిన ‘పక్కా కమర్షియల్’ ‘థాంక్యూ’ వంటి చిత్రాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus