Allu Arjun: టీం మాత్రమే కాదు అల్లు అర్జున్ కూడా చిక్కుల్లో పడ్డాడా?

నిన్న ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  ప్రీమియర్ షోలు వేశారు. టికెట్ల కోసం అభిమానులు థియేటర్ల వద్ద ఉన్న టికెట్ కౌంటర్ల వద్ద క్యూలు కట్టారు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. నిన్న నైట్ సంధ్య థియేటర్ వద్దకి అల్లు అర్జున్ వెళ్లడం జరిగింది. దీంతో అభిమానులు అతన్ని చూసేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో ఓ మహిళ, అతని కొడుకు కింద పడిపోవడంతో జనాలు వారిని తొక్కుకుంటూ వెళ్లారు.

Allu Arjun

అందువల్ల ఆ మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ఈ కారణాల వల్ల అల్లు అర్జున్  (Allu Arjun) టీంపై కేసు నమోదైంది. కేవలం టీంపైనే కాదు అల్లు అర్జున్ కూడా చిక్కుల్లో పడినట్టు తాజా సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో భాగంగా అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైనట్లు సమాచారం.ఈ విషయాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ తెలియజేశారు. ఇప్పటివరకు సెక్యూరిటీ మేనేజర్, థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ టీం పై మాత్రమే పెట్టినట్టు అంతా అనుకున్నారు.

కానీ హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదవ్వడం అభిమానులకి షాకిచ్చింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన ఇష్టానికి తాను థియేటర్ కి రావడం పట్ల మండిపడుతూ పోలీసులు అల్లు అర్జున్ పై కేసు పెట్టినట్లు స్పష్టమవుతుంది. ఈ విషయంపై ‘పుష్ప 2’ నిర్మాతలైన ‘మైత్రి మూవీ మేకర్స్’ కూడా చింతిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. బాధితురాలి కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని వారు భరోసా ఇచ్చారు.

నితిన్ సినిమా పోస్ట్ పోన్ కానుందా?!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus