Balakrishna: మలినేని- బాలయ్య.. కాంబో నిజమేనా..?!

‘అఖండ’ కి ముందు పదేళ్లలో చూసుకుంటే.. బాలకృష్ణ (Balakrishna) వరుసగా హిట్లు కొట్టిన సందర్భాలు తక్కువ. అలాంటి ట్రాక్ రికార్డ్ ని.. బ్రేక్ చేసి బాలకృష్ణకి ఓ మంచి మాస్ హిట్ ఇచ్చాడు దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) . ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). నవీన్ ఎర్నేని, (Naveen Yerneni), వై.రవి శంకర్ (Y .Ravi Shankar) ..లు కలిసి ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

Balakrishna

2023 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా..చిరంజీవి (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమాతో పోటీపడి మరీ విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.75 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది ఈ సినిమా.’వీరసింహారెడ్డి’ లో ప్రధానంగా పెద్ద బాలకృష్ణ పాత్రని గోపీచంద్ మలినేని ఎలివేట్ చేసిన విధానం బాగుంది. హోమం సీన్ విజువల్స్ కావచ్చు, ఆ తర్వాత టెంపుల్ వద్ద జీప్ దిగి జనాలని పలకరించే సీన్ కావచ్చు.. మాస్ ఆడియన్స్ కి ముఖ్యంగా నందమూరి అభిమానులకు మంచి హై ఇచ్చాయి అని చెప్పాలి.

అందుకే కొన్ని ఏరియాల్లో ఈ సినిమా శతదినోత్సవ వేడుకలు కూడా జరుపుకుంది. ఇదిలా ఉంటే.. గోపీచంద్ మలినేని పనితనానికి మెచ్చి హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అతనికి మరో ఛాన్స్ ఇచ్చాడట. ‘ఎస్.ఎల్.వి.సినిమాస్’ బ్యానర్లో బాలకృష్ణ ఓ సినిమా చేయాలి. అందుకు గోపీచంద్ మలినేని కథకి ఓకే చెప్పాడట బాలయ్య. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది అని వినికిడి. అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కూలీ కోసం మరో టాలీవుడ్ హీరో.. లోకేష్ ప్లానెంటీ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus