Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ తో హల్ చల్ చేస్తున్న హాట్ బ్యూటీస్..! అసలు ప్లాన్ ఏంటంటే.?

బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా అని ముందే చెప్పారు. చెప్పినట్లుగానే ఇప్పుడు 5వ వారంలో హాట్ బ్యూటీలని హౌస్ లోకి పంపిస్తున్నారు. ఈ బ్యూటీస్ తో పాటుగా మరికొంత మంది ఆర్టిస్టులు సైతం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అసలు మేటర్లోకి వెళితే., బిగ్ బాస్ రీ లాంఛ్ అక్టోబర్ 8వ తేదిన గ్రాండ్ గా అవ్వబోతోంది. అదేంటి.. రీలాంఛ్ అనుకుంటున్నారా.. ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ లాంఛ్ లో కేవలం 14మంది హౌస్ మేట్స్ ని మాత్రమే పంపారు. ఇప్పుడు 4వారాలు అయిపోయాయి కాబట్టి 4గురు అవుట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో హౌస్ లో కేవలం 10మంది మాత్రమే ఉన్నారు.

అందుకే, ఇప్పుడు మరో 6గురు కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపిస్తూ ఆదివారం అక్టోబర్ 8వ తేదిన మరోసారి లాంఛ్ చేయబోతున్నారు. పార్టిసిపెంట్స్ ఎంట్రీ సాంగ్స్ తో, ఎవిలతో స్టేజ్ మరోసారి దద్దరిల్లబోతోంది. ఇందులో సీరియల్ ఆర్టిస్ట్ లతో పాటుగా హాట్ భామలు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సీరియల్ ఆర్టిస్ట్ అర్జున్ అంబటి అంటే అందరికీ సుపరిచితమే. దేవత సీరియల్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. అలాగే, గుండమ్మ కథ సీరియల్ ద్వారా ఫేమ్ అయిన పూజా మూర్తి కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఇక యూట్యూబ్ లో తన ప్రత్యేకమైన ఇంటర్య్వూస్ తో ఆకర్షిస్తున్న నిఖిల్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యూట్యూబ్ లో సింగర్ గా, లిరిసిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న భోళే షవాలి, జబర్ధస్త్ కెవ్వు కార్తీక్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే, నీతోనే డ్యాన్స్ తో ఫేమ్ అయిన అంజలీ పవన్ కూడా ఎంట్రీ ఇస్తోంది. వీరితో పాటుగా మోడల్ అశ్విని తన హాట్ అందాలతో కనువిందు చేసేందుకు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అశ్విని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది.

పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ లో కీలకమైన రోల్ లో కనిపిస్తుంది అశ్విని. ఇక అశ్వినితో పాటుగా నయనీ పావనీ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. సోషల్ మీడియాలో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న నయనీ పావనీకి ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు. తన రీల్స్ ఇన్ స్ట్రాలో చాలా ఫేమస్. మరి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఎలా ఆడతారు అనేది చూడాలి. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే నలుగురు ఫిమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అందుకే, నలుగురు ఫిమేల్ కంటెస్టెంట్స్ ని (Bigg Boss 7 Telugu) హౌస్ లోకి పంపించబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హౌస్ మేట్స్ వారియర్స్ అయితే, ఛాలెంజర్స్ గా వచ్చిన వాళ్లు గేమ్ ఆడతారు. అప్పుడు సీజన్ 7 వేరే లెవల్లో ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, బిగ్ బాస్ టీమ్ కూడా ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో సరిగ్గా గేమ్ ఆడని వాళ్లని ఎలిమినేట్ చేసేసి కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని పంపించాలని చూస్తోంది. మరి ఈ టైమ్ లో ఇప్పుడు వస్తున్న ఈ హాట్ భామలు ఎంతవరకూ గేమ్ ఆడతారు. నామినేషన్స్ లో ఎలా తలబడతారు అనేది ఆసక్తికరం.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus