తన హాస్యంతో అద్భుతాలు చేసిన బ్రహ్మానందంకి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో రుణపడి ఉన్నారు. ఒకప్పుడు
బ్రహ్మానందం లేని సినిమా ఊహించ గలమా. స్టార్ హీరో సినిమాలో కూడా బ్రహ్మానందం కి సెపెరేట్ కామెడీ ట్రాక్ ఉండాల్సిందే. బ్రహ్మానందం కామెడీ తోనే హిట్ అయిన సినిమాలు అనేకం. ఐతే బ్రహ్మానందంలో గొప్ప నటుడే ఉన్నాడని తెలిసిన ప్రేక్షకులకు కొత్త టాలెంటెడ్ పరిచయం చేశారు. బ్రహ్మానందం గొప్పగా చిత్రాలు గీస్తారు అని ఇప్పుడే తెలిసింది.
ఇటీవల బ్రహ్మానందం శ్రీరాముడు, ఆంజనేయుడు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న చిత్రాన్ని గీశారు. బ్రహ్మానందం గీసిన ఆ పెన్సిల్ ఆర్ట్ అద్భుతంగా ఉంది. అయోధ్యలో రామమందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని బ్రహ్మనందం ఆ బొమ్మ గీయడం జరిగింది. కాగా బ్రహ్మానందం గీసిన కొన్ని అద్భుత చిత్రాలు మీ కోసం సేకరించడం జరిగింది.