ఈ ఏడాది సినీ పరిశ్రమలో విడాకులు తీసుకుని విడిపోయిన 10 జంటలు ఏవో తెలుసా?

  • December 27, 2022 / 02:34 PM IST

సినీ పరిశ్రమలో నటీనటుల ప్రేమ వ్యవహారాలు, సహజీవనం వ్యవహారాలు ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాం. సినిమా వాళ్లకు సంబంధించిన ఏ విషయాలు అయినా .. ముఖ్యంగా పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు ఏవైనా సరే జనాలకు ఆసక్తి ఎక్కువ.అందుకే ప్రేమ,డేటింగ్ వార్తలు.. నిజం అని వాళ్ళు ప్రకటించేలోపే.. విషయం చాలా దూరం వెళ్ళిపోతుంది. మొదట్లో బాగానే ఉంటున్న ఈ జంటలు ఆ తర్వాత.. అటు తర్వాత సైలెంట్ గా సెపరేట్ అవ్వడం..వీటిపై గుసగుసలు వినిపించడం.. అటు తర్వాత కొద్ది రోజులకు అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ లో మొదలైన ఈ సంస్కృతి తర్వాత అన్ని పరిశ్రమలకు పాకింది. ఇదిలా ఉండగా.. 2022 లో కూడా కొంతమంది సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. అది కాస్త పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. 2022 లో విడాకులు తీసుకున్న ఆ సినీ జంటలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) ధనుష్ – ఐశ్వర్య రజినీకాంత్ :

రజినీకాంత్ కూతురు, అల్లుడు విడిపోతున్నట్లు ఏడాది ప్రారంభంలోనే ప్రకటించారు. 18 ఏళ్ళు కలిసున్న ఈ జంట ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యుండి కూడా విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇటీవల ఈ జంట తిరిగి కలుసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది కానీ దాని పై ఎటువంటి క్లారిటీ రాలేదు.

2) యోయో హానీ సింగ్ – షాలినీ తల్వార్ :

బాలీవుడ్ ర్యాపర్, మ్యూజిక్ కంపోజర్ యో యో హనీసింగ్ తన భార్య షాలినీతో విడాకులు తీసుకోబోతున్నట్లు ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రకటించడం జరిగింది. 2011లో పెళ్లి చేసుకున్న ఈ జంట… విడిపోవడం అందరికీ షాక్ ఇచ్చింది.’హనీసింగ్ నన్ను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా, ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ షాలిని కోర్టుకెక్కింది.

3) రాజీవ్ సేన్ – చారు అసోపా :

సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ తన భార్య ప్రముఖ టీవీ నటి చారు అసోపా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే కూతురు జియానుకు తల్లిదండ్రులుగా మాత్రం కలుస్తామని చెప్పారు.

4) రాఖీ సావంత్ – రితేష్ :

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటుంది రాఖీ సావంత్. బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె వాలెంటైన్స్ డే రోజు తన భర్త రితేష్ సింగ్ తో విడిపోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది.రితేష్ ఆల్రెడీ పెళ్లైన విషయాన్ని తన దగ్గర దాచిపెట్టాడని, వారు విడాకులు తీసుకోలేదు కాబట్టి చట్టబద్ధంగా తమ వివాహం చెల్లదంటూ అతడితో తెగదెంపులు చేసుకున్నట్టు తెలిపింది ఈ బ్యూటీ. ప్రస్తుతం తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన అదిల్ దురానీతో సహజీవనం చేస్తోంది రాఖీ.

5) సుస్మితా సేన్ – లలిత్ మోదీ :

స్టార్ హీరోయిన్ సుస్మితాసేన్ మొన్నటి వరకు తనకంటే 15 ఏళ్ల చిన్నవాడైన మోడల్ ప్రముఖ మోడల్ రోహమన్తో ప్రేమాయణం నడిపిన ఈమె అటు తర్వాత మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీతో సహజీవనం చేస్తుందంటూ ప్రచారం జరిగింది. వీరిద్దరు మాల్దీవుల్లో షికార్లు చేసిన ఫొటోలు, లండన్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న పిక్స్ స్వయంగా లలిత్ మోదీ షేర్ చేశాడు. పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా తెలిపాడితను. తర్వాత ఏమైందో ఏమో ఇద్దరూ విడిపోయారు.

6) సోహైల్ ఖాన్ – సీమా :

సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ కూడా భార్య నుండి విడిపోయాడు. సోహైల్- సీమా ఖాన్లు 24 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

7) రఫ్తార్ – కోమర్ వహ్రా :

మ్యూజిక్ డైరెక్టర్ రఫ్తార్ కూడా తన భార్య కోమర్ నుండి ఈ ఏడాది విడిపోయాడు. వీరి విడాకులు కూడా హాట్ టాపిక్ అయ్యాయి.

8) ఆమిర్ అలీ – సంజీదా షేక్ :

ఈ జంట గతేడాదే విడాకులు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ 2022 లో దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

9) నితీష్ భరద్వాజ్ – స్మిత గేట్ :

నితీశ్‌ భరద్వాజ్.. తన భార్య స్మిత గేట్ కు విడాకులు ఇచ్చాడు. చాలా కాలం కలిసున్న ఈ జంట ఈ ఏడాది విడిపోయింది.

10) బాల- ముత్తు మ‌ల‌ర్‌ :

స్టార్ డైరెక్టర్ బాలా కూడా ఏడాది తన భార్య ముత్తు మ‌ల‌ర్‌ కు విడాకులు ఇచ్చినట్టు ప్రకటించి అందరినీ షాక్ కి గురి చేశాడు

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus