Devara, Game Changer: దేవర, గేమ్ ఛేంజర్ మధ్య ఉన్న ఈ పోలికలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

రాజమౌళి (S. S. Rajamouli) డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో అటు రామ్ చరణ్ (Ram Charan), ఇటు ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు. అటు చరణ్ కెరీర్ కు ఇటు తారక్ కెరీర్ కు ఈ సినిమా ఎంతో ప్లస్ అయింది. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర (Devara) సినిమాతో బిజీగా ఉండగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game changer) సినిమాతో బిజీగా ఉండటం గమనార్హం. ఈ రెండు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

దేవర సినిమా ఈ ఏడాది దసరా పండుగ కానుకగా విడుదల కానుండగా గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానున్నా రిలీజ్ డేట్ విషయంలో స్పష్టత లేదు. అయితే ఈ రెండు సినిమాల మధ్య ఉన్న పోలికల గురించి తెలిసి ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతవుతోంది. ఈ రెండు సినిమాలలో హీరో డ్యూయల్ రోల్ లో తండ్రీ కొడుకుల పాత్రలలో కనిపించనున్నారు.

రివేంజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయని హీరో విలన్ పై ప్రతీకారం తీర్చుకునే కథాంశంతో ఈ సినిమాలు తెరకెక్కుతున్నాయని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. రెండు సినిమాలలో తండ్రి పాత్ర చనిపోతుందని భోగట్టా. ఈ రెండు సినిమాలలో శ్రీకాంత్ నటిస్తుండటం గమనార్హం.

ఈ రెండు సినిమాలలో విలేజ్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. దేవర, గేమ్ ఛేంజర్ సినిమా సినీ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలు ఆ ఆశలను నెరవేరుస్తాయో లేదో చూడాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు వేర్వేరుగా 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు అనుకున్న సమయానికి షూటింగ్ ను పూర్తి చేసుకుని ఈ ఏడాది థియేటర్లలో విడుదలయ్యేలా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus