Raghava: రాఘవ లారెన్స్ సక్సెస్ కావడానికి టాలీవుడ్ స్టార్ హీరోలే కారణమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, కొరియోగ్రాఫర్ గా ఊహించని స్థాయిలో రాఘవ లారెన్స్ పాపులారిటీని సంపాదించుకోవడంతో పాటు కెరీర్ పరంగా సక్సెస్ సాధించారు. రాఘవ లారెన్స్ నటించిన చంద్రముఖి2 సినిమా మరో 48 గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కంగనా రనౌత్ ఈ సినిమాలో చంద్రముఖి రోల్ లో నటించడం గమనార్హం.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాఘవ లారెన్స్ మాట్లాడుతూ రెబల్ మూవీ తర్వాత మరో తెలుగు సినిమాకు డైరెక్షన్ చేయడం కుదరలేదని అన్నారు. చంద్రముఖి2 సినిమా ద్వారా ప్రేక్షకులను కలుసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో టికెట్ కొనుక్కొని సినిమా చుస్తున్నారని రాఘవ లారెన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

అభిమానుల ప్రేమలోనే తాను దేవుణ్ని చూసుకున్నానని రాఘవ లారెన్స్ కామెంట్లు చేశారు. చంద్రముఖి2 మూవీ కథ విన్న వెంటనే రజనీకాంత్ కు ఫోన్ చేశానని రజనీకాంత్ గారు ఈ సినిమా కథ విని ఆల్ ది బెస్ట్ చెప్పారని రాఘవ లారెన్స్ కామెంట్లు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంతమంది ఫ్యాన్స్ సొంతం అయ్యారంటే చిరంజీవి అన్నయ్య ప్రధాన కారణమని రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చారు.

చిరంజీవి గారి నుంచి డ్యాన్స్ నేర్చుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. నన్ను దర్శకుడిని చేసిన నాగార్జునను ఎప్పటికీ మరిచిపోలేనని రాఘవ లారెన్స్ కామెంట్లు చేశారు. చంద్రముఖి2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి, నాగార్జున వల్లే తనకు ఈ స్థాయి వచ్చిందని రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చారు. రాఘవ లారెన్స్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. లారెన్స్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus