ఇప్పటి వరకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సౌత్ స్టార్ హీరోలు, దర్శకులు ఎవరంటే..?

2022 సంవత్సరం సౌత్ సినిమాకి గర్వకారణమనే చెప్పాలి.. తెలుగు, తమిళ్, కన్నడ మూవీస్ దేశ మరియు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటాయి.. చిన్న చిత్రాలు సైతం ఊహించని వసూళ్లతో చరిత్ర సృష్టించాయి. ‘బాహుబలి’ తో ప్రభాస్‌ని పాన్ ఇండియా స్టార్‌ని చేయడమే కాక పాన్ వరల్డ్ గుర్తింపు తెచ్చిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ తో ఎన్టీఆర్ – రామ్ చరణ్‌లను పాన్ ఇండియా స్టార్లగా మార్చారు. కన్నడ యాక్టర్ కమ్ ఫిలిం మేకర్ రిషబ్ శెట్టి, ‘కార్తికేయ – 2’ తో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కూడా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటారు. ఈ నలుగురు హీరోలు 2022లో కొత్తగా ఈ లిస్టులోకి చేరడం విశేషం అయితే.. ఇప్పటి వరకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న, సినిమాలు చేసిన స్టార్స్, డైరెక్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

1) జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తో ఫస్ట్ టైం పూర్తి స్థాయిలో హిందీతో సహా మిగతా దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.. అయితే రామ్ చరణ్ అంతకుముందే ‘జంజీర్’ మూవీతో హిందీ వాళ్లను పలకరించాడు.. ఆ సినిమాతో విమర్శల పాలయైన సంగతి తెలిసిందే. అపుడు తిట్టిన వాళ్లే ఇప్పుడు చెర్రీ పొగుడుతున్నారు. ఈ సినిమాతో వీళ్లిద్దరు ప్యాన్ ఇండియా స్టార్స్‌ అయిపోయారు.

2) నిఖిల్ సిద్దార్థ్

కార్తికేయ – 2.. ఈ సినిమా మౌత్ పబ్లిసిటీతో హిందీలో కూడా సత్తా చాటింది. ఒక్క హిందీలోనే దాదాపు రూ. 32 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఓవరాల్‌గా రూ. 100 కోట్ల గ్రాస్‌కు పైగా కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. కార్తికేయ 2తో నిఖిల్ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు..

3) రిషబ్ శెట్టి

కాంతారా మూవీతో రిషబ్ శెట్టి ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. కన్నడలో రూ. 15 కోట్లతో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం విశేషం. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ సత్తా చాటిన రిషబ్ శెట్టి ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు..

4) ఎస్.ఎస్.రాజమౌళి

రాజమౌళి పూర్తి స్థాయిలో పాన్ ఇండియా దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించారు. బాహుబలితో వచ్చిన గుర్తింపుని గతేడాది ఆర్ఆర్ఆర్‌తో కంటిన్యూ చేసి బాక్సాఫీస్ దగ్గర తన మాయాజాలాన్ని ప్రపంచమంతా చూపించారు..

5) శంకర్

దర్శకుడు శంకర్‌కు కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాదు.. తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈయన సినిమాలు ఒకప్పుడు తెలుగులోనూ అద్భుతమైన విజయం సాధించాయి. బాయ్స్, అపరిచితుడు లాంటి సినిమాలు తమిళం కంటే తెలుగులోనే పెద్ద విజయం సాధించాయి. అంతకుముందు ప్రేమికుడు, జీన్స్, జెంటిల్‌మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు లాంటి సినిమాలు కూడా సంచలన విజయం సాధించాయి. రాజమౌళి కంటే ముందు శంకర్ పాన్ ఇండియా దర్శకుడిగా నార్త్‌లో సత్తా చాటారు. రజినీ కాంత్‌తో తెరకెక్కించిన రోబో, 2.O సినిమాలు దర్శకుడిగా శంకర్ సత్తా ఏంటో చూపించాయి. అటు మణిరత్నం కూడా పాన్ ఇండియా లెవల్లో రోజా, పొన్నియన్ సెల్వన్ లాంటి సినిమాలతో అలరించారు.

6) ప్రభాస్

బాహుబలితో పాన్ ఇండియా లెవల్లో అలరించిన ప్రభాస్.. ఆ తర్వాత సాహో మూవీతో హిందీ రీజియన్‌లో మంచి వసూళ్లతో రాబట్టాడు.. రాధే శ్యామ్ చిత్రంతో నిరాశ పరిచినా రాబోయే సినిమాలతో మరోసారి సత్తా చాటబోతున్నాడు..

7) రానా దగ్గుబాటి

రానా దగ్గుబాటి బాహుబలి కంటే ముందు పలు హిందీ చిత్రాలతో అక్కడి ప్రేక్షుకులను అలరించాడు. తెలుగు, హిందీతో పాటు తమిళంలోనూ సినిమాలు చేసి పాన్ ఇండియా యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు..

8) రాకింగ్ స్టార్ యష్

ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ అంటే యష్ పేరే చెప్పాలి.. ఎందుకంటే కేజీఎఫ్ మూవీతో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మించిన వసూళ్ళు కేజీఎఫ్ 2 రాబట్టిన సంగతి తెలిసిందే..

9) అల్లు అర్జున్

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడు. 2021లో రూ. 350పైగా కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన సినిమాగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 15 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న దక్షిణాది నటుడి రికార్డ్ కూడా బన్నీదే కావడం విశేషం. ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 167 కోట్ల షేర్‌తో పాటు రూ. 320 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి 2021లో మన దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది..

10) ధనుష్

ధనుష్.. ఈ పేరుని, హీరోని పాన్ ఇండియా లెవల్లో అందరూ గుర్తు పడతారు. ఇప్పటికే హిందీలో రాంజానా, షమితాబ్, అత్రాంగి రే సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.. త్వరలో పూర్తి స్థాయి పాన్ ఇండియా ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు..

11) విజయ్ దేవరకొండ

లైగర్ మూవీతో విజయ్ దేవరకొండ తొలిసారి హిందీలోకి అడుగు పెట్టాడు.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ఇమేజ్‌ సాధించాలనే కల నెరవేరలేకపోయింది.. కానీ బీటౌన్‌లో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు..

12) రష్మిక మందన్న

గుడ్ బై మూవీతో హిందీ ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులకు పరిచయమైంది.. ఫస్ట్ హిందీ సినిమా ఫ్లాప్ అవడంతో సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న మిషన్ మజ్ను మూవీతో హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటుంది..

13) సమంత

ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా ప్రేక్షకులకు చేరువైంది సమంత.. ఈ సిరీస్ తర్వాత హిందీలో పలు ప్రాజెక్టులతో పాటు ఏకంగా హాలీవుడ్ మూవీలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది..

14) ప్రియమణి

ప్రియమణి కూడా అంతకు ముందు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘రావణ్’ మూవీతో పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించింది.. ఆ తర్వాత షారూఖ్ ఖాన్ చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ఐటెం సాంగ్ చేసింది. ది ఫ్యామిలీ మెన్ రెండు సీజన్లతోనూ పాన్ ఇండియా స్థాయిలో అలరించింది..

15) ఎన్టీఆర్ – ఏఎన్నార్

ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి తొలి తరం హీరోలు కూడా అప్పట్లోనే పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేశారు.. ఎన్టీఆర్ చండీరాణి, పాతాల భైరవి వంటి పాన్ ఇండియా ఫిలింస్ చేశారు.. అక్కినేని నాగేశ్వరరావు కూడా సువర్ణ సుందరి వంటి సినిమాలతో హిందీ ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత వీళ్లిద్దరు తెలుగు చిత్ర సీమనే ఏలారు..

16) రజినీ కాంత్ – కమల్ హాసన్

రజినీ కాంత్ – కమల్ హాసన్ ఇద్దరూ కూడా చానాళ్ల క్రితమే తమిళ్, తెలుగు, హిందీలో సినిమాలు చేశారు..

17) చిరు – వెంకీ – నాగ్

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి టాలీవుడ్ సినీయర్ అగ్ర హీరోలు కూడా హిందీ సినిమాల్లో నటించారు.. కానీ పాన్ ఇండియా లెవల్లో అప్పుడున్న పరిస్థితుల కారణంగా కేవలం తెలుగు పరిశ్రమకే పరిమితమయ్యారు..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus