ఈ 10 సాంగ్స్ జ్యూక్ బాక్స్ లో లేవు, కానీ సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్..!

మనం ఇంట్రెస్టింగ్ గా సినిమా చూస్తున్నప్పుడు జ్యూక్ బాక్స్ లో లేని పాటలు కనుక వస్తే సర్-ప్రైజింగ్ గా ఫీలవుతాం కదా. అలాంటి పాటల గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఇటీవల కాలంలో చాలా సినిమాల్లో ఇలాంటి సర్- ప్రైజింగ్ సాంగ్స్ ను జోడించారు మన దర్శకనిర్మాతలు. సినిమాలో కీలక సన్నివేశాలు వచ్చినప్పుడు ఈ పాటలు రావడంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయని చెప్పొచ్చు. మరి ఇటీవల కాలంలో జ్యూక్ బాక్స్ లో లేని పాటలు.. సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినవి ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) మగువా మగవా(ఫీమేల్ వెర్షన్) : ‘వకీల్ సాబ్’ మూవీలో సెకండ్ హాఫ్ లో ఈ పాట వస్తుంది. నిజానికి ఈ విషయాన్ని డైరెక్టర్ ముందుగానే రివీల్ చేసాడు. కానీ ఈ పాట జ్యూక్ బాక్స్ లో ఉండదు.. సినిమాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.

2) సిత్తరాల శిరపడు : ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ఈ పాట పెద్ద హిట్ అయ్యింది. కానీ ఈ పాట జ్యూక్ బాక్స్ లో లేదు.. సినిమాలో ఉంటుందని దర్శకుడు త్రివిక్రమ్ ముందుగానే చెప్పాడు. అయినప్పటికీ ఈ పాట స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి.

3) నువ్వని ఇది నీడని : ‘మహర్షి’ సినిమాలోనిది ఈ పాట. నిజానికి జ్యూక్ బాక్స్ లో ఉండదు. సినిమాలో ఉంటుందని దర్శకనిర్మాతలు చెప్పలేదు. కానీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

4) రెడ్డమ్మ తల్లి : ‘అరవింద సమేత’ చిత్రంలోనిది ఈ పాట. ఇది కూడా జ్యూక్ బాక్స్ లో ఉండదు. కానీ అన్ని పాటల కంటే ఇదే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

5) తనేమందే తనేమందే : ‘గీత గోవిందం’ సినిమాలోని ఈ పాట కూడా జ్యూక్ బాక్స్ లో కనపడదు. అయినా సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

6) ఓరయ్యో : ‘రంగస్థలం’ సినిమాలోని ఈ పాట గుర్తుందా? ఇది జ్యూక్ బాక్స్ లో ఉండదు. హీరో అన్నయ్య చనిపోయాక వస్తుంది. అందరితో కంటతడి పెట్టిస్తుంది. కానీ సినిమాలో ఇది కూడా కీలకమైన పాటనే చెప్పాలి.

7) అందమైన లోకం : ‘జై లవ కుశ’ చిత్రంలోని ఈ ఎమోషనల్ సాంగ్ కూడా జ్యూక్ బాక్స్ లో ఉండదు. కానీ సినిమాలో మంచి సిట్యుయేషనల్ సాంగ్ గా వచ్చి అందరి చేత కన్నీళ్ళు పెట్టిస్తుంది.

8) నిన్ను కోరి : నాని నటించిన ‘నిన్ను కోరి’ చిత్రంలోనిది ఈ పాట.ఇది కూడా జ్యూక్ బాక్స్ లో ఉండదు.. కానీ సినిమా టైటిల్స్ పడేదే ఈ పాటతో..! అందుకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

9) నాన్నకు ప్రేమతో : ఎన్టీఆర్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలోది ఈ పాట. ఇది జ్యూక్ బాక్స్ లో ఉండదు.. కానీ హృదయాన్ని హత్తుకునేలా ఈ పాట ఉంటుంది.

10) పీటర్ పార్కర్ స్టాట్యూకి : ‘1 నేనొక్కడినే’ సినిమాలో క్లైమాక్స్ లో వస్తుంది ఈ పాట. ఇది జ్యూక్ బాక్స్ లో ఉండదు. కానీ అందరికీ ఫేవరెట్ సాంగ్ గా నిలిచింది.

11) మనిషి ముసుగులో : ‘ధృవ’ చిత్రంలోని ఈ పాట కూడా జ్యూక్ బాక్స్ లో ఉండదు. కానీ ఈ పాటకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus