మెగాస్టార్ చిరంజీవి ఇటీవల దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం అయిన పద్మ విభూషణ్ కి ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై 2 , 3 రోజులుగా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు అంతా చిరంజీవి ఇంటికి వెళ్లి మరీ సత్కరించి వస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. పద్మవిభూషణ్ అవార్డు లభించడం పై సంతోషం వ్యక్తం చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే గతంలో పద్మ విభూషణ్ అవార్డు గతంలో ఏ టాలీవుడ్ హీరోకి రాలేదా? వస్తే ఎవరికి వచ్చింది.మొత్తంగా సౌత్ లో ఎవరెవరికి ఈ అవార్డు లభించిందో ఒక లుక్కేద్దాం :
టాలీవుడ్లో పద్మ విభూషణ్ అందుకున్న తొలి కథానాయకుడిగా అక్కినేని నాగేశ్వరరావు నిలిచారు. 2011లో ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఆ తర్వాత అంటే 2016 లో సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఈ పురస్కారం లభించింది. 2006లో మెగాస్టార్ చిరంజీవికి పద్మ భూషణ్ (Padma Vibhushan) పురస్కారం కూడా లభించింది. చిరంజీవి తెలుగు చిత్ర సీమకి చేసిన సేవలను గుర్తించి ఇలాంటి గొప్ప పురస్కారాలు అందించాయి ప్రభుత్వాలు.
ముఖ్యంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సకాలంలో అందరికీ రక్తం అందేలా చేసి ఎన్నో ప్రాణాలను నిలబెట్టారు చిరు. అలాగే కోవిడ్ వంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు తగిన సాయం చేయడానికి ముందుగా నిలబడుతుంటారు చిరు. కరోనా టైంలో పేద కళాకారులను కూడా ఆదుకున్నారు చిరు.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!