Rakshith Shetty: ఆ హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన రక్షిత్ శెట్టి.. ఏం చెప్పారంటే?

ప్రస్తుతం అన్ని భాషల్లో పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది. అయితే కొన్ని సినిమాలు మాత్రం సినిమా హిట్టైన తర్వాత ఇతర భాషల్లో డబ్ అవుతున్నాయి. రక్షిత్ శెట్టి నటించిన సప్తసాగర దాచే ఎల్లో కన్నడలో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించగా తెలుగులో ఈ సినిమా సప్తసాగరాలు దాటి అనే టైటిల్ తో రిలీజవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తుండటం గమనార్హం. రక్షిత్ శెట్టికి జోడీగా రుక్మిణీ వసంత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం గమనార్హం.

హేమంత్ ఎం.రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ నెల 22వ తేదీన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగ రక్షిత్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరోలైన బన్నీ, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ లకు కర్ణాటకలో ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉందని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో ఈ హీరోలు పాపులర్ అని ఈ హీరోలను ఎంతోమంది అభిమానిస్తారని ఆయన కామెంట్లు చేశారు.

ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిన సప్తసాగరాలు దాటి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. పరిమిత సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిలీజవుతోంది. మౌత్ టాక్ తో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రక్షిత్ శెట్టి (Rakshith Shetty) గతంలో నటించిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. కొత్తదనం ఉన్న కథలకు రక్షిత్ శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో వరుస విజయాలు దక్కుతున్నాయి. రక్షిత్ శెట్టి భవిష్యత్తు ప్రాజెక్ట్ లను రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రక్షిత్ శెట్టిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus