‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మాణంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మనం’. అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య,అక్కినేని నాగేశ్వర రావు,శ్రీయ,సమంత.. ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీలో అఖిల్ కూడా అతిథి పాత్రల్లో కనిపించాడు. అక్కినేని నాగేశ్వర రావు గారికి ఇది ఆఖరి చిత్రం. అమల కూడా చిన్న కేమియో ఇచ్చారు. ఎటువంటి అంచనాలు లేకుండా 2014 వ సంవత్సరం మే 23న విడుదలైన ఈ మూవీ ఘనవిజయం సాధించింది.
ఈ మూవీ (Manam) ఓ క్లాసిక్ అని చెప్పొచ్చు. అనూప్ రూబెన్స్ సంగీతం, విక్రమ్ కుమార్ మ్యాజికల్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని కలిగించాయి. నేటితో ఈ మూవీ విడుదలై 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అయితే ఈ చిత్రానికి విక్రమ్ నాగార్జున, నాగ చైతన్య ఫస్ట్ ఆప్షన్ కాదు. అసలు అక్కినేని ఫ్యామిలీ కోసం విక్రమ్ కుమార్ ఈ కథని రాసుకోలేదు. ఆ ఫ్యామిలీకి మాత్రమే ఈ మూవీ సెట్ అయ్యింది.
నిజానికి ఈ దర్శకుడు, రైటర్ అయిన బీవీఎస్ రవి చెప్పిన పాయింట్ ను ‘మనం’ కథగా మలిచాడు దర్శకుడు విక్రమ్ కె కుమార్. మొదట ఈ కథని రాంచరణ్, రానా లకు వినిపించాడు. కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు. నిజానికి కథగా చెబితే ఈ చిత్రాన్ని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు అని విక్రమ్ కుమార్ కూడా ఓ సందర్భంలో చెప్పారు. అయితే ఒకరోజు నాగ చైతన్యని కలిసి విక్రమ్ కుమార్ ఈ కథని చెప్పడంతో అతను ఇంప్రెస్ అయ్యాడట.
ఆ తర్వాత నాగార్జున వద్దకు విక్రమ్ ను తీసుకెళ్లి అరగంట నెరేషన్ ఇవ్వగానే నాగ్ ఓకే చెప్పేసి ‘మనం’ చేయడానికి రెడీ అయ్యారట. ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటితో 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అక్కినేని అభిమానులకే కాకుండా యావత్ సినీ అభిమానులకి ఇది చాలా స్పెషల్ మూవీ అని చెప్పాలి.