Star Heroes: 2023 సంవత్సరంలో ఫ్యాన్స్ ను నిరాశపరిచిన స్టార్ హీరోలు వీళ్లే!

2023 సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది హీరోలకు భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందించింది. అయితే మరి కొందరు హీరోలు మాత్రం ఈ ఏడాది ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయలేదు. టైర్1 హీరోలైన చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఈ ఏడాది సినిమాలేవీ విడుదల చేయలేదు. వెంకటేష్, నాగార్జున సినిమాలు కూడా ఈ ఏడాది విడుదల కాలేదు. వెంకీ గెస్ట్ రోల్ లో నటించిన ఒక హిందీ మూవీ మాత్రం ఈ ఏడాది విడుదలైంది.

2023 సంవత్సరంలో సిల్వర్ స్క్రీన్ పై కనిపించని టాలీవుడ్ స్టార్స్ వీళ్లే కావడంతో ఈ హీరోల అభిమానులు ఎంతగానో ఫీలవుతున్నారు. 2023 సంవత్సరంలో ఫ్యాన్స్ ను నిరాశపరిచిన స్టార్ హీరోలు వీళ్లే కావడంతో ఈ హీరోల అభిమానులు తెగ ఫీలవుతుండటం గమనార్హం. అయితే ఈ హీరోలు ఈ ఏడాది తమ సినిమాలను రిలీజ్ చేయకపోయినా వచ్చే ఏడాది తమ సినిమాలను రిలీజ్ చేయనున్నారు.

ఈ హీరోల (Star Heroes) సినిమాలు వచ్చే ఏడాది విడుదలై సక్సెస్ సాధించడంతో పాటు పాన్ ఇండియా హిట్లను అందుకుంటారేమో చూడాల్సి ఉంది. ఈ హీరోల సినిమాలతో 2024 సంక్రాంతి నుంచి దసరా వరకు థియేటర్లు కళకళలాడనున్నాయి. 2024 సంవత్సరం ప్రేక్షకులకు మరింత స్పెషల్ గా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2024లో రిలీజయ్యే సినిమాల్లో కనీసం 4 సినిమాలు 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఉంది.

గేమ్ ఛేంజర్, దేవర, పుష్ప2, గుంటూరు కారం, ప్రాజెక్ట్ కే, సలార్2, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ మరికొన్ని సినిమాల రిలీజ్ లతో స్పెషల్ గా ఉండనుంది. వచ్చే ఏడాది చిరంజీవి మినహా దాదాపుగా అందరు స్టార్స్ సినిమాలు రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. టాలీవుడ్ హీరోలకు 2024లో కెరీర్ బెస్ట్ హిట్లు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2024 సంవత్సరంలో 150కు పైగా సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus