‘అ!’ చిత్ర కథను నడిపించే చిన్నారి

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘అ!’ సినిమా టైటిల్ ఆవిష్కరణ దగ్గర నుంచి అందరి దృష్టిని ఆవిష్కరిస్తోంది. ఈ చిత్రంలో నిత్యా మీనన్‌, కాజల్‌ అగర్వాల్, శ్రీనివాస్‌ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే నాని, రవితేజ కూడా చేప, చెట్టు రూపంలో సినిమాలో భాగం కానున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన “అ!” థీమ్ సాంగ్ ‘“విశ్వమే దాగినా నాలోనా.. ఎప్పుడూ ఒంటరే నేనేనా” అనే పాట పాత్రల స్వభావాన్ని పరిచయం చేసింది. ఈ పాట ఒకటే సినిమాలో ఉంటుందని తెలిసింది.

అయితే తాజాగా బయటికి వచ్చిన విషయం ఏమిటంటే ఈ చిత్రంలో చిన్నారి పోషించిన పాత్ర చుట్టూ కథ అల్లుకుంటుందని సమాచారం. ఆ పాపను థీమ్ సాంగ్ మొదట్లో చూపించారు కూడా. ఇలా సినిమాలోని ప్రతి అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో నాని నిర్మాతగా మారి నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని చిత్ర బృందం తెలిపింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus