ఈ శుక్రవారం సినిమాలు!

ఈమధ్య శుక్రవారం వస్తుందంటే.. ఏ సినిమాలు వస్తున్నాయని కాదు ఎన్ని సినిమాలు వస్తున్నాయో లెక్కపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వారానికి రెండుమూడు సినిమాలు రిలీజవ్వడమేంటి అనుకొన్నారో ఏమో తెలియదు కానీ.. ఒకేవారం పోటీపడి మరీ డజను సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. గత నెలలో ఇలాగే ఒకేవారం 8 సినిమాలు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తూ ఈవారం ఏకంగా 13 తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. వాటికితోడు మూడు ఇంగ్లీష్ మూవీస్ కూడా యాడ్ అవ్వడంతో మొత్తం 16 సినిమాలు ఈవారం థియేటర్లో దర్శనమివ్వనున్నాయి.

తెలుగు సినిమాల లిస్ట్ చూస్తే.. 1) లచ్చి, 2) సీత రామునికోసం, 3) జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, 4) ఇది మా ప్రేమకథ, 5) 10, 6) కుటుంబ కథా చిత్రం, 7) తొలి పరిచయం, 8) మాతంగి, 9) మరో దృశ్యం, 10) ప్రేమ పందెం, 11) ఉందా లేదా, 12) మామ ఓ చందమామ సినిమాలు శుక్రవారం విడుదలవుతుంటే.. “కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్” అనే సినిమా రేపు రిలీజావుతోంది. ఇవి కాకుండా “ఫెర్డినాండ్ 2, డాడీస్ హోమ్ 2, స్టార్ వార్స్: ది లాస్ట్ జేడీ” వంటి హాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ భారీ లిస్ట్ లో నవీన్ చంద్ర-నివేదా థామస్ జంటగా తెరకెక్కిన “జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్”, యాంకర్ రవి కథానాయకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిన “ఇది మా ప్రేమకథ”, విక్రమ్-సమంత జంటగా నటించిన తమిళ చిత్రం “10” తప్పితే ఆసక్తి రేపే సినిమాలు ఇంకేం లేవు. సో, ఈ శుక్రవారం ఏమిటి ఈ వారం మొత్తం మూవీ లవర్స్ కి జాతరే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus