Rashmika, Vikram: విక్రమ్ సినిమా నుంచి రష్మిక తప్పకుందా..?

కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ‘పుష్ప’ సినిమా ఆమె క్రేజ్ ను పెంచేసింది. దేశవ్యాప్తంగా రష్మికకు అభిమానులు పెరిగిపోయారు. ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రీసెంట్ గా ‘గుడ్ బై’ అనే బాలీవుడ్ సినిమాతో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడనప్పటికీ.. రష్మికకు అక్కడ వరుస అవకాశాలు వస్తున్నాయి.

మరోపక్క సౌత్ లో కూడా చాలా సినిమాలు సైన్ చేస్తోంది. ప్రస్తుతం ‘పుష్ప2’, ‘వారసుడు’ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. అలానే రీసెంట్ గా ‘చియాన్61’ సినిమా ఒప్పుకుంది. విక్రమ్ హీరోగా దర్శకుడు పా.రంజిత్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఇందులో హీరోయిన్ గా రష్మికను అనుకున్నారు. తొలుత ఆమె కూడా సినిమా సైన్ చేసింది.

కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కాల్షీట్స్ అడ్జస్ట్ చేయలేక ఆయన సినిమా వదులుకుంది సమాచారం. ఈమెకి బదులుగా మరో హీరోయిన్ ను తీసుకున్నారట. ఆమె మరెవరో కాదు.. మాళవిక మోహనన్. కోలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది మాళవిక. ఇప్పుడు తెలుగు సినిమాలు కూడా చేస్తోంది.

ప్రభాస్-మారుతి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పుడు విక్రమ్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దివాలీకి ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus