ఎన్టీఆర్ బయోపిక్ లో నాలుగు తరాలవారు

అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ సినిమా ఒక మధుర జ్ఞాపకంగా మిగిలింది. ఇందులో మూడుతరాలవారు నటించారు. అదే విధంగా ఎన్టీఆర్ బయోపిక్ మూవీ నందమూరి కుటుంబానికి ఫ్యామిలీ ఆల్బం గా మారనుంది. ఇందులో నాలుగు తరాల వారు నటించనున్నారు. అయితే మహానటుడు నందమూరి తారక రామారావు ప్రత్యక్షంగా నటించరు. కానీ అలనాటి సినిమాలోని కొన్ని క్లిప్పింగ్స్ వాడుకోనున్నారు. ఇక రెండో తరమైన బాలకృష్ణ ఇందులో 62 గెటప్స్ వేయనున్నారు. అలాగే మూడో తరం నటుడు కళ్యాణ్ రామ్ కాసేపు సినిమాలో మెరవనున్నారు. ఈ ఫ్యామిలీ చిత్రంలో చిన్న రోల్ అయినా చేయడానికి సంతోషంగా ఒప్పుకున్నారని తెలిసింది. ఇక నాలుగో తరం నటుడు శౌర్య రామ్.

ఈ చిన్నారి ఎవరో కాదు కళ్యాణ్ రామ్ తనయుడు. ఇదివరకు ఇజం సినిమాలోనూ నటించి అందరితో మెప్పు అందుకున్నాడు. ఆ చిన్నారి తేజ ని సైతం ఆకర్షించాడు. అందుకే బయోపిక్ లో ఎన్టీఆర్ చిన్నప్పటి రోల్ ని శౌర్య రామ్ చేత వేయించడానికి తేజ ఫిక్స్ అయ్యారు. సినిమాని శౌర్య రామ్ నుంచే మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. సెంటిమెంట్ పరంగా బాగుంటుందని వారి నమ్మకం. ఇక బాలకృష్ణపై రీసెంట్ గా టీజర్ షూట్ చేశారు. ఎన్టీఆర్ గెటప్ లో ఉన్న ఈ ఒక్క సీన్ టీజర్ ద్వారా జనవరి 18న రిలీజ్ చేయనున్నారు. పండుగ తర్వాత నందమూరి అభిమానులకు మరో పండుగ రానుందన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus