నిర్మాతగా, కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న బండ్ల గణేష్ కు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గత కొన్నేళ్లుగా బండ్ల గణేష్ సినిమాలకు దూరంగా ఉన్నా ప్రతి వారం ఏదో ఒక విధంగా ఆయన వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్ పోటీ చేయాలని భావించినా ఆయనకు టికెట్ దక్కలేదు. ఆ సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కామెంట్లు చేసి బండ్ల గణేష్ విమర్శల పాలయ్యారు.
అయితే బండ్ల గణేష్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ జోరుగా ప్రచారం చేయడంతో పాటు బండ్ల గణేష్ ఫ్లెక్సీలు హాట్ టాపిక్ అయ్యాయి. బండ్ల గణేష్ ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తారని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ ఎన్నికల్లో కూడా ఆయన ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి గురించి బండ్ల గణేష్ స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.
బండ్ల గణేష్ పోటీ చేసిన పదవికి కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు ఎన్నిక కావడం గమనార్హం. బండ్ల గణేష్ ప్రతి ఎన్నికలో ఓటమిపాలు అవుతూ ఉండటంతో ఆయన అభిమానులు తెగ ఫీలవుతున్నారు. బండ్ల గణేష్ ఎన్నికలకు దూరంగా ఉండాలని పలువురు అభిమానులు సూచనలు చేస్తుండటం గమనార్హం. బండ్ల గణేష్ నిర్మాతగా యాక్టివ్ కావాలని పలువురు అభిమానులు కోరుకుంటున్నారు. అయితే వేర్వేరు కారణాల వల్ల చాలామంది స్టార్ హీరోలు బండ్ల గణేష్ కు ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు.
బండ్ల గణేష్ మళ్లీ నిర్మాతగా బిజీ అవుతారో లేదో చూడాల్సి ఉంది. బండ్ల గణేష్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బండ్ల గణేష్ నటుడిగా అయినా బిజీ కావాలని మరి కొందరు కోరుకుంటున్నారు. బండ్ల గణేష్ కు ఎన్నికలు అచ్చిరాలేదని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.