Jr NTR: తారక్ కెరీర్ లో తొలిసారి ఇలా జరుగుతోందా?

బాల నటుడిగా బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామాయణం సినిమాలలో అద్భుతంగా నటించి మెప్పించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన తర్వాత కెరీర్ విషయంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి. సినిమాల పరంగా సక్సెస్ లో ఉన్నా ఫెయిల్యూర్ లో ఉన్నా ఒకే విధంగా ఉండే హీరోగా తారక్ కు పేరుంది.

ఎంతోమంది ఫ్లాప్ డైరెక్టర్లకు అవకాశాలను ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ డైరెక్టర్లు తెరకెక్కించిన సినిమాలతో విజయాలను అందుకున్నారు. ఈ ఏడాది విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, చరణ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కు ముందే ఎన్టీఆర్30 కొరటాల శివ డైరెక్షన్ లో, ఎన్టీఆర్31 ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయని అధికారికంగా ప్రకటనలు వెలువడ్డాయి. ఆచార్య సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడం,

ఆచార్య ఆర్థిక వ్యవహారాలు కొరటాల శివపై ప్రభావం చూపడంతో ఎన్టీఆర్30 సినిమా అంతకంతకూ ఆలస్యమవుతుండటం గమనార్హం. మరోవైపు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కితే ఎన్టీఆర్31 మరింత ఆలస్యం కానుంది. అయితే సలార్ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోందని అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

ఆచార్య, సలార్ సినిమాలు తారక్ కు పరోక్షంగా చిక్కులు సృష్టిస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తారక్ తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమాలతో తారక్ విజయాలను అందుకుంటారో లేదో చూడాల్సి ఉంది. నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని సినిమాల విషయంలో తారక్ ఫాలో అవుతుండటం గమనార్హం. సినిమాసినిమాకు తారక్ రేంజ్, మార్కెట్ పెరుగుతోంది. తారక్ కెరీర్ లో తొలిసారి ఈ విధంగా జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus