Jr NTR: తారక్ కెరీర్ ప్లానింగ్ గురించి సంచలన ప్రచారం.. నిజమేంటంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR) ఈ మధ్య కాలంలో ఒక డైరెక్టర్ సినిమాకు ఓకే చెప్పారని ఆ సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కనుందని బాలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. తారక్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ కూడా రెండు భాగాలుగా తెరకెక్కనున్నాయని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. మరో ఏడేళ్ల పాటు తారక్ డైరీ ఫుల్ బిజీ అని మరో డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా లేదని ప్రచారం జరిగింది.

వాస్తవం ఏంటంటే ఎన్టీఆర్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలు మినహా మరే కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం తారక్ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న నేపథ్యంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలే వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడుతున్నాయి. తారక్ కెరీర్ ప్లానింగ్ కు సంబంధించి సంచలన వార్తలు ప్రచారంలోకి రావడంతో అభిమానులు ఒకింత కంగారు పడ్డారు.

అయితే తారక్ మాత్రం ఒకింత క్లారిటీతోనే ఉన్నారని కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో గందరగోళానికి ఛాన్స్ లేకుండా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులకు మొదట ఛాన్స్ ఇవ్వనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకలి దేవర (Devara) సినిమాతో తీరబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎన్టీఆర్ గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా భిన్నమైన సినిమా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనిరుధ్ (Anirudh Ravichander) సైతం ఈ సినిమాకు అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారని సమాచారం అందుతోంది. త్వరలో విడుదలవుతున్న సెకండ్ సింగిల్ పై మేకర్స్ అంచనాలను పెంచేస్తున్నారు. ఈ సాంగ్ లవ్ సాంగ్ కాగా తారక్ జాన్వీ (Janhvi Kapoor)  ఒకే ఫ్రేమ్ లో ఎలా కనిపిస్తారో అని అభిమానులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus