Rajinikanth: ఎంత ఎదిగినా ఒదిగి ఉంటున్న రజనీకాంత్.. గొప్పదనానికి ఇదే సాక్ష్యమా?

స్టార్ హీరో రజనీకాంత్ ఏడు పదుల వయస్సులో జైలర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. రజనీకాంత్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో జైలర్ సినిమాతో మరోమారు ప్రూవ్ అయింది. నెల రోజుల్లో ఈ సినిమాకు 630 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. తమిళనాడు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మార్క్ ను చేరుకున్న తొలి ఇండియన్ మూవీ జైలర్ కావడం గమనార్హం. ఈ విధంగా జైలర్ మూవీ ఖాతాలో సంచలన రికార్డ్ చేరింది. తమిళనాడు రాష్ట్రంలో 900 థియేటర్లలో ఈ సినిమా విడుదల కాగా ఇప్పటికీ కొన్ని థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో కూడా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతమవుతున్నాయి.

అయితే రజనీకాంత్ కు (Rajinikanth) భక్తి ఎక్కువనే సంగతి తెలిసిందే. తాజాగా రజనీకి సంబంధించిన ఒక వీడియో వైరల్ కాగా ఆ వీడియోలో రజనీకాంత్ వేసుకున్న షర్ట్ కు జేబు లేదు. దేవుడిని దర్శించుకున్న తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ చొక్కా మడతలోంచి డబ్బులు ఇచ్చారు. 40 సంవత్సరాల క్రితం చాలామంది డబ్బులను ఇలా చొక్కా మడతల్లో పెట్టుకున్నారు. అప్పటి ఆచారాలను, సాంప్రదాయాలను పాటిస్తున్న రజనీ గ్రేట్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎంత ఎదిగినా రజనీకాంత్ ఒదిగి ఉంటారని ఆయన గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. రజనీకాంత్ పారితోషికం భారీ రేంజ్ లో ఉండగా సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రం రజనీకి కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కడం గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రజనీ కొత్త ప్రాజెక్ట్ లతో కూడా రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus