Jailer, Salaar: జైలర్, సలార్ సినిమాల మధ్య ఉన్న లింక్ గురించి మీకు తెలుసా?

రజనీకాంత్ నెల్సన్ కాంబినేషన్ లో తెరకెక్కిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్లు 400 కోట్ల రూపాయలు దాటిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ గత సినిమాలు ఫ్లాప్ అయినా జైలర్ సినిమాతో రజనీకి పూర్వ వైభవం రావడంతో పాటు క్రేజ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. జైలర్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ లో నటించడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయింది.

జైలర్ సినిమాలో బాలయ్య నటించి ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జైలర్ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు 700 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రజనీకాంత్ త్వరలో మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. జైలర్ సినిమాలో విలన్ రజనీకాంత్ ను డైనోసార్ తో పోల్చారనే సంగతి తెలిసిందే. సలార్ టీజర్ లో ప్రభాస్ ను డైనోసార్ తో పోల్చిన సంగతి తెలిసిందే.

జైలర్, సలార్ సినిమాల మధ్య ఉన్న ఈ కనెక్షన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. జైలర్ సినిమాలా సలార్ సినిమా కూడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జైలర్ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లకు రెట్టింపు స్థాయిలో సలార్ సినిమా కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జైలర్ (Jailer) సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని ప్రకటన రాగా సలార్ సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమా సెప్టెంబర్ నెల 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus