Salaar: సలార్ మూవీకి మహాభారతానికి ఉన్న లింక్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సలార్ మూవీకి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కాగా పీవీఆర్, ఐనాక్స్ లకు సంబంధించిన సమస్య పరిష్కారం కావడంతో ఈ మూవీకి బుకింగ్స్ మరింత పెరిగాయి. సలార్ మూవీ గురించి టిన్ను ఆనంద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ మా ఇంటికి రుచికరమైన భోజనం పంపారని ప్రభాస్ ఆతిథ్యం చాలా బాగుంటుందని టిన్ను ఆనంద్ తెలిపారు.

సలార్ మూవీకి ఎదురులేదని మహాభారతంలోని కొన్ని అంశాలు సలార్ లో అంతర్లీనంగా కనిపిస్తాయని ఆయన కామెంట్లు చేశారు.సలార్ తో గొప్ప కథను వెండితెరపై చూపించనుందని టిన్ను ఆనంద్ అభిప్రాయపడ్డారు. విజయ్ కిరంగదూర్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు భారీ స్థాయిలో ఉన్నాయి.

ఏఎంబీ సినిమాస్ లో సైతం అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ సినిమా ప్రదర్శితం కావడం గమనార్హం. సలార్ మూవీకి అదనపు టికెట్ రేట్ల వల్ల ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి మంచి లాభాలను అందిస్తుందేమో చూడాల్సి ఉంది. సలార్ క్లైమాక్స్ కచ్చితంగా ఆకట్టుకుంటుందని ప్రశాంత్ నీల్ చెబుతున్నారు.

సలార్ (Salaar) సినిమాకు క్రిటిక్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఉగ్రమ్ మూవీ మూలకథ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారని సమాచారం అందుతోంది. సలార్ సినిమా బాలీవుడ్ లో కూడా ప్రేక్షకుల మెప్పు పొందాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సలార్ సినిమాకు ప్రభాస్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతున్నాయి.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus