అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. కొన్ని దశాబ్దాల హిందువుల కల నెరవేరిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా శ్రీరామ నామస్మరణలు మారుమోగిపోయాయి. ఈ అద్భుతమైనటువంటి మహాకార్యం కన్నులారా చూడడం కోసం ఎంతోమంది సెలబ్రిటీలు అయోధ్య చేరుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ చిరంజీవి వంటి తదితరులు హాజరయ్యారు. అయితే ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ వంటి వారికి కూడా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందినప్పటికీ వెళ్లలేక పోయారు
మరి జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ అయోధ్య వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా భారీ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. దాదాపు 100 మందికి పైగా ఆర్టిస్టులతో ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతున్నటువంటి తరుణంలో ఎన్టీఆర్ అయోధ్యకు వెళ్లలేదని సమాచారం. అదేవిధంగా సైఫ్ అలీ ఖాన్ ప్రమాదానికి గురి కావడంతో ఆయనని పరామర్శించడానికి ఎన్టీఆర్ వెళ్లారని సమాచారం.
ఇక పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కూడా (Ayodhya) అయోధ్యకు వెళ్లలేదు అందుకు కారణం ఈయన కల్కి సినిమా షూటింగ్లో బిజీగా ఉండటమే కారణమని తెలుస్తుంది. ఈ సినిమా మే 9వ తేదీ విడుదల కానున్న తరుణంలో షూటింగ్ పనులు జరుగుతున్నాయని వీటన్నింటినీ పోస్ట్ పోన్ చేయటం వల్ల నిర్మాతలు నష్టపోతారని గ్రహించి ఈ హీరోలు ఇద్దరు కూడా అయోధ్య వెళ్ళలేదని తెలుస్తోంది.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!