‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం…’ అంటూ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా 200 రోజుల వేడుకలో చిరంజీవి మాటలు పెద్ద ఎత్తున దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారంటూ… ఓ వర్గం వైరల్ చేసింది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున విమర్శలు ప్రారంభించారు. దీంతో చిరంజీవి నిజంగానే ఇలా అన్నారు అనిపించింది. వైరల్ వీడియోలు కూడా రావడంతో ఇంకా నమ్మకం ఏర్పడింది. అదే సమయంలో సినిమా టీమ్ రిలీజ్ చేసిన ఫుల్ వీడియోలో ఆ మాటలు లేవు. దీంతో కావాలనే కట్ చేసి పంపారు అని అన్నారు.
అయితే తాజాగా సినిమా (Waltair Veerayya) టీమ్ నుండి క్లారిటీ వచ్చింది. చిరంజీవి ఆ రోజు అన్న మాటలు ఇవీ అంటూ ఉమారు రెండున్నర సినిమాల వీడియోను రిలీజ్ చేశారు. అందులో చిరంజీవి ఏం చెప్పారు, ఎందుకు అన్నారు, విషయం ఏంటి, సందర్భం ఏంటి అనే వివరాలు ఉన్నాయి. దీంతో ఓహో జరిగింది ఇదా అంటూ ముక్కును వేలేసుకుంటున్నారు కొంతమంది. అయితే కొందరు మాత్రం ముందుగా ఎందుకు ఇవ్వలేదు, ఒక రోజు గ్యాప్ ఎందుకొచ్చింది లాంటి మాటలు అంటున్నారు. ఆ విషయాలు పక్కనపెడితే ఆ రోజు ఏమన్నారో చూద్దాం.
‘‘రాజకీయ నాయకులతో పోల్చుకుంటే సినిమా ఎంతండీ.. చిన్నది. నేను అదీ చూశా.. ఇదీ చూశా. మీలాంటి వాళ్లు పెద్ద పెద్ద విషయాల్లో జోక్యం చేసుకోవాలి. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ అవకాశాలు తదితర వాటిని ఇవ్వగలిగితే, దాని కోసం ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరం తలొంచి నమస్కరిస్తాం. అంతేగాని పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద ఏంటి సర్’ అని అన్నారు. ఈ మాటలకు సంబంధించిన లీక్డ్ వీడియో రావడంతో తమ ప్రభుత్వాన్ని ఉద్దేశించే చిరంజీవి మాట్లాడారని ఏపీకి చెందిన నేతలు చిరంజీవిపై ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ విమర్శలు చేశారు.
ఈ క్రమంలో ఆ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడిన ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. అందులో చిరు ఈ మాటలు అన్నది నిజం కానీ.. అయితే ఆయన రాజ్యసభలో జరిగిన ఓ చర్చ / మాటలను ఉటంకిస్తూ ఈ మాటలు అన్నారు. దీంతో ఏపీ నేతలు ‘గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నారు’ అనే సామెతను బయటకు తీశారు చిరు ఫ్యాన్స్. ‘‘సినిమా నటుల రెమ్యూనరేషన్ గురించి పార్లమెంటులో మాట్లాడుతున్నారు.
రెమ్యూనరేషన్ తీసుకోవడం తప్పు అన్నట్లుగా ఎత్తిచూపొద్దు. రెమ్యూనరేషన్ అంశం పెద్దల సభ అయిన రాజ్యసభ వరకు తీసుకెళ్లొద్దు. వ్యాపారం జరుగుతోంది కాబట్టే సినిమాలు చేస్తున్నాం. వ్యాపారం జరుగుతోంది కాబట్టే నటులకు, సాంకేతిక నిపుణులకు డబ్బులు ఇస్తున్నారు’’ అని పవన్ చెప్పాడు. ‘‘సినిమాలు చేస్తున్నాం కాబట్టే మావాళ్లకు ఉపాధి లభిస్తోంది. దేశంలో సినీ పరిశ్రమ కంటే పెద్ద సమస్య ఇంకేదీ లేదన్నట్లు మావైపు చూస్తున్నారు. రాజకీయాలతో పోల్చుకుంటే సినిమా చాలా చిన్నది. సినిమాలను రాజకీయాలకు దూరంగా ఉంచండి.
మా కష్టాలేవో మేం పడతాం. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నందునే ఖర్చు పెడుతున్నాం. ఖర్చు పెడుతున్నందుకే అంత ఆదాయం రావాలని కోరుకుంటున్నాం. వీలైతే ప్రభుత్వాలు సహకరించాలి.. అణగదొక్కాలని చూడొద్దు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా మా మీద పడతారెందుకు సర్’’ అని చిరంజీవి అన్నారు. ఈ నేపథ్యంలో ఇకనైనా ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’ కామెంట్స్ విషయం సమసిపోతుందా? అసలు రాజ్యసభలో ఈ మాటలు అన్నదెవరు? మరి వాళ్లేమైనా ఇప్పుడు రిప్లై ఇస్తారా అనేది చూడాలి.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!