Bigg Boss 7 Telugu: నాగార్జున హోలోగ్రామ్ దర్శినితో హౌస్ లోకి ఎంట్రీ..! ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నారు?

బిగ్ బాస్ హౌస్ లో ఆరోవారం ఎలిమినేషన్ ఘట్టం రసవత్తరంగా మారింది. ఈసారి నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు ఉన్నారు. ఇందులో ముగ్గురు అబ్బాయిలు అయితే నలుగురు అమ్మాయిలు ఉన్నారు. టాప్ పొజీషన్ లో ప్రిన్స్ యావర్ ఉన్నాడు. ప్రిన్స్ యావర్ కి మంచి ఓటింగ్ జరుగుతోంది. అలాగే అమర్ కి కూడా మంచి ఓటింగ్ జరుగుతోంది. వీళ్లిద్దరూ సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఇక టేస్టీ తేజ కూడా లాస్ట్ వీక్ కంటే కూడా తన ఓటింగ్ ని మెరుగు పర్చుకున్నాడు.

సేఫ్ గానే ఉన్నాడు. మిగిలన నలుగురు అమ్మాయిల్లో నుంచే ఈవారం ఎలిమినేషన్ అనేది జరగబోతోంది. అయితే, హాలోగ్రామ్ దర్శిని ద్వారా నాగార్జున హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి బిగ్ షాకింగ్ ఎలిమినేషన్ చేయబోతున్నాడనేది టాక్. బిగ్ బాస్ స్టార్టింగ్ ఎపిసోడ్ లోనే నాగార్జున హాలోగ్రామ్ దర్శినిని పరిచయం చేశాడు. ఈసారి నేను ఎప్పుడైనా సరే దీనిద్వారా వస్తానని హౌస్ మేట్స్ ని నేరుగా పలకరిస్తానని అన్నాడు. అందుకే, ఇప్పుడు నాగార్జున ఎప్పుడు వస్తాడు ? ఎవరిని ఎలిమినేట్ చేస్తాడు అనేది ఆసక్తిగా మారింది.

ఈ హాలోగ్రామ్ దర్శిని అనేది వీడియోకాల్ లా కూడా ఉపయోగించవచ్చు. మరి దీనిని హౌస్ మేట్స్ కి ఎలా కనెక్ట్ చేస్తారు ? అయితే నాగార్జున ఈవారం వస్తారా లేదా వచ్చేవారం వచ్చి ఎవరినైనా ఎలిమినేట్ చేస్తారా అనేది చూడాలి. మరోవైపు నలుగురు అమ్మాయిల్లో అశ్విన, పూజా మూర్తి ఇంకా శోభాశెట్టి ఈ ముగ్గురూ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. నయనీ పావనీ సేఫ్ జోన్ లో ఉంది. చాలా అన్ అఫీషియల్ సైట్స్ లో శోబాశెట్టి లీస్ట్ లో ఉంది.

మరి శోభాశెట్టిని ఎలిమినేట్ చేస్తారా.. లేదా కొత్తగా వచ్చిన వాళ్ల నుంచీ ఎలిమినేషన్ జరగబోతోందా అనేది ఆసక్తిగా మారింది. అయితే, ఈవారం బిగ్ షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతోందని చెప్తున్నారు. సోషల్ మీడియా న్యూస్ ప్రకారం శోభాశెట్టి ఈవారం ఎలిమినేట్ అవ్వచ్చని అంటున్నారు. మరి చూద్దాం.. లాస్ట్ మినిట్ లో బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ఏదైనా ట్విస్ట్ ఇస్తాడేమో.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus