Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ వీకెండ్ ఇచ్చే ట్విస్ట్ ఇదేనా ? అసలు ఏం జరగబోతోందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఈసారి పవర్ అస్త్రా సంపాదించలేకపోయిన వాళ్లందరూ కూడా నామినేషన్స్ లోకి వచ్చారు. శివాజీకి ఇచ్చిన పవర్ అస్త్రా కోల్పోవడం వల్ల ఈసారి శివాజీని కూడా నామినేట్ చేశారు ఇంటి సభ్యులు. దీంతో ప్రశాంత్, సందీప్, శోభాశెట్టి తప్ప మిగిలిన వాళ్లందరూ కూడా నామినేషన్స్ లోకి వచ్చారు. దీంతో ఈసారి పబ్లిక్ ఓటింగ్ అనేది చాలా ప్రామఖ్యతని సంతరించుకుంది. అయితే, శివాజీ రెండు వారాల తర్వాత మళ్లీ నామినేషన్స్ లోకి రావడం వల్ల హ్యూజ్ గా ఓట్లు పడుతున్నాయ్.

సగానికి సగం ఓట్లు శివాజీనే కైవసం చేసుకుంటున్నాడు. తర్వాత శుభశ్రీ, అలాగే ప్రిన్స్ యావార్ లకి కూడా హ్యూజ్ ఓటింగ్ జరుగుతోంది. ఎలాగైనా సరే స్టార్ మా బ్యాచ్ ని పంపించేయాలని చూస్తున్నారు ఆడియన్స్. అందుకే అమర్ కి ఓటింగ్ అనేది బాగా పడిపోయింది. గత వారాలతో పోలిస్తే అమర్ చాలా ఓటింగ్ పర్సెంటేజ్ ని తగ్గించుకున్నాడు.

ఇక మరోవైపు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రియాంక, తేజ, గౌతమ్, ఇంకా అమర్ సైతం డేంజర్ జోన్ లో ఉన్నారంటే ఆడియన్స్ ఏ రేంజ్ లో పగబట్టారో అర్ధం చేస్కోవచ్చు. అయితే, బిగ్ బాస్ ఇప్పుడు వీకెండ్ ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అనేది ఇంట్రస్టింగ్. ఎందుకంటే, ఇప్పటికే హౌస్ మేట్స్ దగ్గర ఉన్న తమ పవర్ అస్త్రాలని బిగ్ బాస్ తిరిగి ఇచ్చేయమని చెప్పాడు.

దీంతో శివాజీతో పాటుగా పవర్ అస్త్రారాన్ని సందీప్, శోభా, పల్లవి ప్రశాంత్ లు కూడా కోల్పోయి సాధరణ హౌస్ మేట్స్ గా మిగిలారు. ఇక బిగ్ బాస్ వీకండ్ లో హౌస్ మేట్స్ కాకపోయిన వాళ్లని, అస్సలు పవర్ అస్త్రాని పొందలేకపోయిన వాళ్లని ఎలిమినేట్ చేసి కొత్త బ్యాచ్ ని దింపాలని చూస్తోంది.

అక్టోబర్ 8వ తేదినే మరోసారి బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) గ్రాండ్ లాంఛ్ ఉండబోతోంది. మరి ఈ నేపథ్యంలో వీళ్లని ఎలిమినేట్ చేస్తారా.. లేదంటే వీళ్లతోనే ఆటని కొనసాగిస్తారా లేదా అనేది చూడాలి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus