ఈ వీకెండ్ క్యూ కట్టిన రోమాంటిక్ మూవీస్!

ప్రతి వీకెండ్ మూవీస్ రిలీజ్ అవుతూనే ఉంటాయి.. కానీ చాలా అరుదుగా మాత్రమే ఒకే జోనర్ సినిమాలు ఒకేవారం విడుదలవుతుంటాయి. ఈ వీకెండ్ అలాంటి అరుదైన వీకెండ్ గా పేర్కొనవచ్చు. ఎందుకంటే.. “నా నువ్వే, సమ్మోహనం” అనే రెండు రోమాంటిక్ లవ్ స్టోరీస్ ఈవారం విడుదలవుతున్నాయి. కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన “నా నువ్వే” యూత్ ఫుల్ లవ్ స్టోరీ కాగా.. ఈ సినిమా ట్రైలర్ మంచి అంచనాలను క్రియేట్ చేసింది. కళ్యాణ్ రామ్ కొత్తగా కనిపిస్తుండడంతోపాటు.. తమన్నా అందాలు ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి. అలాగే.. “సమ్మోహనం” మీద కూడా ప్రేక్షకులకి మంచి అంచనాలున్నాయి.

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుధీర్ బాబు, అదితిరావు హైదరీ జంటగా నటించగా.. ఈ చిత్రం కూడా రోమాంటిక్ ఎంటర్ టైనర్ కావడం విశేషం. జూన్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఒక సాధారణ యువకుడు, ఒక హీరోయిన్ కి తెలుగు నేర్పించాల్సి రావడం, అసలు ఇండస్ట్రీ మీద కానీ ఇండస్ట్రీలో వర్క్ చేసే ఆర్టిస్ట్స్ గురించి కానీ సరైన అభిప్రాయం లేని ఓ యువకుడు ఒక హీరోయిన్ తో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనేది “సమ్మోహనం” కాన్సెప్ట్. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా విజయం సాధిస్తుంది అనే విషయం పక్కన పెడితే.. పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ కోసం “నా నువ్వే” చిత్రాన్ని, ఇంద్రగంటి సెన్సిబుల్ స్క్రీన్ ప్లే కోసం “సమ్మోహనం” చిత్రాన్ని తప్పకుండా చూడాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus