This Weekend Movies: థియేటర్ తో సమానంగా ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..!

ప్రతీవారం థియేటర్ తో సమానంగా ఓటీటీలో ప్లాట్ ఫామ్స్ లో కూడా సినిమాలు సందడి చేస్తున్నాయి. చెప్పాలంటే థియేటర్ ను మించే ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. లాక్ డౌన్ టైంలో అందరికీ ఎంటర్టైన్మెంట్ పంచింది ఓటీటీ సంస్థలే అని చెప్పాలి. అప్పటి నుండి థియేట్రికల్ హక్కులతో సమానంగా ఓటీటీ(డిజిటల్ రైట్స్) హక్కులు అమ్ముడవుతున్నాయి. అందువల్ల చిన్న సినిమాలు కూడా బ్రతుకుతున్నాయి. కొత్త టాలెంట్ బయటపడుతుంది. నటీనటులందరికీ గుర్తింపు లభిస్తుంది. అయితే ఓటీటీల వల్ల జనాలు థియేటర్లకు రావడం లేదంటూ… మొన్నటి వరకు నిర్మాతలు షూటింగ్లు వంటివి ఆపేస్తూ సమ్మెలు వంటివి మొదలుపెట్టారు. హీరోలు పారితోషికాలు తగ్గించుకోవాలి అంటూ పరోక్షంగా చర్చలు జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ‘సీతా రామం’ ‘బింబిసార’ ‘కార్తికేయ2’ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్లు అవ్వడంతో థియేటర్లకు ఊపిరి ఇచ్చినట్టు అయ్యింది. ఓ సినిమా బాలేదు అనే టాక్ వస్తే ఆ సినిమాని ఓటీటీలో చూసుకుందామని జనాలు లైట్ తీసుకుంటున్న మాట నిజం. ఇక్కడ ఇంకోటి గమనించాలి ఓటీటీలో చూసుకుందామని జనాలు కొన్ని సినిమాలకు థియేటర్లకు వెళ్లడం లేదు. అంటే సినిమాని జనాలు లైట్ తీసుకోవడం లేదు అనే విషయాన్ని కూడా నిర్మాతలు అర్థం చేసుకోవాలి. సరే గత వారం లానే ఈ వారం కూడా ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు/ వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ప్లీజ్ ఫైండ్ అటాచ్డ్ : ఈ హిందీ వెబ్ సిరీస్ ఆగస్టు 24 నుండి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది.

2) సమారిటన్ : ఈ హాలీవుడ్ మూవీ ఆగస్టు 26 నుండి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది.

3) ది వేకింగ్ రెడ్ : ఆ హాలీవుడ్ సిరీస్ ఆగస్టు 22 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

4) లాస్ట్ ఓల్లి : ఈ టీవీ సిరీస్ ఆగస్టు 24 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

5) థట్స్ అమోర్ : ఈ మూవీ ఆగస్టు 25 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

6) ఢిల్లీ క్రైమ్ :ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 26 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

7) సియోల్ వైట్ : ఈ కొరియన్ మూవీ ఆగస్టు 26 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

8) మీ టైమ్ : ఈ మూవీ ఆగస్టు 26 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

9) పార్టనర్ ట్రాక్ : ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 26 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

10) హౌస్ ఆఫ్ ది డ్రాగన్ : ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 22 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది

11) ఫియర్ లెస్ : ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 22 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది

12) రిపీట్ : ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 25 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది

13) క్రిమినల్ జస్టిస్ : ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 25 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది

14) మహారాణి : ఈ హిందీ సిరీస్ ఆగస్టు 25 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది

15) ఓదెల రైల్వే స్టేషన్ : హెబ్బా పటేల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ ఆగస్టు 26 నుండి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.

16) ఓ మంచి రోజు చూసి చెప్తా : నిహారిక, విజయ్ సేతుపతి నటించిన ఈ మూవీ ఆగస్టు 26 నుండి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus