కోవిడ్ వలన, లాక్ డౌన్ వలన, రిలీజ్ ఆలస్యమైన సినిమాలు అన్నీ ఒకదాని వెనుక ఇంకోటి అన్నట్టు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లకు పోటీగా ఓటీటీలో కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. గత వారం థియేటర్లో రానా- సాయి పల్లవి ల ‘విరాటపర్వం’, సత్యదేవ్ ‘గాడ్ సే’ సినిమాలు రిలీజ్ అయ్యాయి.ఇవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోతున్నాయి. అయితే ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు మాత్రం పర్వాలేదు అనిపించాయి. ఇక ఈ వారం కూడా 10 కి పైనే సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటం విశేషం. ఇందులో 9 సినిమాల వరకు థియేటర్లలో రిలీజ్ అవుతుంటే… కొన్ని సినిమాలు మాత్రం ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లో విడుదల కాబోతున్న సినిమాలు :
1) సమ్మతమే : కిరణ్ అబ్బవరం , చాందినీ చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం టీజర్,ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘యుజి ప్రొడక్షన్స్’ బ్యానర్ పై కె.ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. జూన్ 24న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
2) చోర్ బజార్ : ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని జీవన్ రెడ్డి దర్శకత్వం వహించగా ‘ఐవీ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై వి.ఎస్ రాజు నిర్మించారు. ఈ చిత్రం జూన్ 24న విడుదల కాబోతుంది. ‘యూవీ క్రియేషన్స్’ సమర్పణలో ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండడం విశేషం.
3) 7 డేస్ 6 నైట్స్ : ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇది.ఆయన కొడుకు సుమంత్ అశ్విన్ కూడా ఇందులో ఓ హీరోగా నటించాడు. ‘సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్’ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరించారు. జూన్ 24న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
4) ఒక పథకం ప్రకారం : పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్, ఆశీమా నర్వాల్ జంటగా వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డు విన్నర్ వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. జూన్ 24న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
5) గ్యాంగ్ స్టర్ గంగరాజు : ‘వలయం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన లక్ష ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘చదలవాడ బ్రదర్స్’ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మించారు. జూన్ 24న ఈ మూవీ విడుదల కాబోతోంది.
6) షికారు : ‘శ్రీ సాయి లక్ష్మీ క్రియేషన్స్’ బ్యానర్ పై పిఎస్ఆర్ కుమార్ (బాబ్జీ) నిర్మాతగా హరి కొలగాని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘షికారు’. సాయి ధన్సిక ప్రధాన పాత్రలో తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ, నవ కాంత్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో కన్నడ కిషోర్, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, పోసాని, అన్నపూర్ణ, సురేఖ వాణి, సత్య శ్రీ, గాయత్రి రెడ్డి(బిగిల్ ఫేం) ఈ చిత్రంలో నటించారు. జూన్ 24 న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.
7) సదా నన్ను నడిపే : ప్రతీక్ ప్రేమ్, వైష్ణవి పట్వర్ధన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని లంకా ప్రతీక్ ప్రేమ్ కరణ్ డైరెక్ట్ చేశారు. ‘ఆర్పీ మూవీ మేకర్స్’ ‘రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్’ బ్యానర్ల పై లంక కరుణాకర్ దాస్ నిర్మించారు. జూన్ 24న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
8) కొండా : కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగా… త్రిగుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రలు పోషించారు. ‘శ్రేష్ట పటేల్ మూవీస్’ బ్యానర్ పై కొండా సుష్మితా పటేల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 23న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
9) పెళ్లి కూతురు పార్టీ : అపర్ణ మల్లాది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రిన్స్, అనీషా ప్రధాన పాత్రలు పోషించారు. ‘పృద్వీ రాజ్ క్రియేషన్స్’ బ్యానర్ పై ఎ.వి .ఆర్ స్వామి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 24న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :
10) సర్కారు వారి పాట : మహేష్ బాబు హీరోగా పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 23 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.
11) ఖాతిర్ : ఈ తమిళ సినిమా జూన్ 24 నుండీ ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ కానుంది.
12) కుట్టావుమ్ శిక్షావుమ్ : ఈ మలయాళం మూవీ జూన్ 24 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
13) మన్మథ లీల : ఈ మూవీ జూన్ 24 నుండీ ‘ఆహా'(తెలుగు) లో స్ట్రీమింగ్ కానుంది.
14) నెంజుకు నీది : ఈ తమిళ సినిమా జూన్ 23 నుండీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.
15) డాక్టర్ స్ట్రేంజ్ 2 : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూన్ 22 నుండీ స్ట్రీమింగ్ కానుంది.