ఈ ఏడాది అక్కినేని హీరోలందరూ రాణించారు

2015లో ఎన్టీయార్, కళ్యాణ్ రామ్, నందమూరి బాలకృష్ణలు వరుస హిట్స్ అందుకొని ఆ ఏడాదిని నందమూరి నామ సంవత్సరంగా ఎలా అయితే మార్చేశారో.. 2017ను అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ వంటి అక్కినేని హీరోలు సక్సెస్ లు సొంతం చేసుకొని అక్కినేని నామ సంవత్సరం చేసేశారు. ఈ ఏడాది నాగచైతన్య “రారండోయ్ వేడుక చూద్దాం”తో సూపర్ హిట్ సొంతం చేసుకోగా, నాగార్జున కూడా “రాజుగారి గది 2” మంచి హిట్ సొంతం చేసుకొన్నారు. ఇక అఖిల్ కూడా తన రెండో చిత్రం “హలో”తో డీసెంట్ హిట్ అందుకొన్నాడు.

అన్నిటికంటే ముఖ్యంగా నాగచైతన్య తాను నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న సమంతను ఇరువర్గాల పెద్దలని ఒప్పించి అంగరంగా వైభవంగా వివాహమాడి సమంతను అక్కినేనివారి కోడలిగా మార్చింది కూడా ఈ సంవత్సరమే. సో ఇన్ని శుభ శకునాలు ఒక ఇంట జరగడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అందుకే 2017ను అక్కినేని నామ సంవత్సరంగా పేర్కొంటున్నారు. ఈ సక్సెస్ రేట్ 2018కి కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొందాం. ఇకపోతే.. ప్రస్తుతం నాగార్జున తనకిష్టమైన రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఇంకా టైటిల్ నిర్ణయించని చిత్రంలో నటిస్తుండగా.. నాగచైతన్య “సవ్యసాచి” మరియు మారుతీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక అఖిల్ ప్రస్తుతం తన తాజా చిత్రం “హలో” సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus