ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఏ రిలీజ్ డేట్‌కీ లేనంత క్రేజ్, పోటీ.. సెప్టెంబర్ 28కి ఉంది. సలార్ సినిమా తప్పుకుందో లేదో.. ఎప్పుడో రిలీజ్ అనౌన్స్ చేసి.. ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేసిన సినిమాలు.. ఇప్పుడు పోస్ట్ పోన్ చేసుకుని సెప్టెంబర్ 28కే రిలీజవుతున్నాయి. ఇప్పటికే బాగా టఫ్ కాంపిటీషన్ ఉంటే.. లేటెస్ట్ గా మరో సినిమా కూడా రిలీజ్ పోస్ట్ పోన్ చేసకుని సలార్ డేట్ నే ఫిక్స్ చేసుకుంది. ప్రభాస్ పక్కకి తప్పుకునే సరికి..
అందరు హీరోలూ.. ప్రభాస్ ప్లేస్ లోకి రావడానికే రెడీ అయ్యారు. ఆల్రెడీ సెప్టెంబర్ లో సలార్ కంటే ముందే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసుకున్న సినిమాలు కూడా ఆ డేట్ క్యాన్సిల్ చేసుకుని సెప్టెంబర్ 28కే పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి. లేటెస్ట్ గా చంద్రముఖి 2 కూడా ఈ లిస్ట్ లో జాయిన్ అయ్యింది. ఆల్రెడీ సెప్టెంబర్ 15 వినాయకచవితి సీజన్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి చెన్నైలో ఈవెంట్స్ తో హడావిడి చేస్తున్న చంద్రముఖి 2..
తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈనెల 11 న అరేంజ్ చేస్తున్నట్టు అనౌన్స్ కూడా చేసింది. కానీ.. ఇప్పుడు సలార్ డేట్ కే షిఫ్ట్ అయినట్టు చెబుతోంది టీమ్. సలార్ పోస్ట్ పోన్ అని తెలియగానే.. ఒక్కొక్కరు వరసగా ఆ డేట్ నే లాక్ చేసుకోవడంతో టఫ్ ఫైట్ ఫేస్ చెయ్యబోతున్నాయి ఈ సినిమాలు.
రకరకాల డేట్లు మార్చుకుని ఆఖరికి సెప్టెంబర్ 15 రిలీజ్ అని డేట్ ఫిక్స్ చేసకున్న రామ్ స్కంద మూవీ.. ఇప్పుడు తూచ్ .. సలార్ డేట్ కే వస్తున్నామంటూ ఫ్రెష్ డేట్ అనౌన్స్ చేసింది. ఇంతకన్నా మంచి డేట్ ఉండదని , అందుకే సినిమాని 15 నుంచి పోస్ట్ పోన్ చేసి 28న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!