Ambajipeta Marriage Band: ‘అంబాజీపేట..’ కంటే ఆ సినిమాలకే ఎక్కువ హైప్ ఉందా?

సంక్రాంతి సినిమాలు రిలీజ్ అవ్వడానికి కొద్దిరోజుల ముందు ప్రముఖ టికెట్ బుకింగ్ పోర్టల్ అయిన ‘బుక్ మై షో’ ఇంట్రెస్ట్..ల పై పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా కంటే కూడా ‘హనుమాన్’ సినిమాకి ఎక్కువ ఇంట్రెస్ట్..లు పడ్డాయనే విషయం బాగా హాట్ టాపిక్ అయ్యింది. దీంతో మహేష్ బాబు సినిమా పై అసలు ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు మహేష్ బాబు యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో రెచ్చిపోయి ప్రేక్షకులను పక్కదోవ పట్టించిన సందర్భాలు కూడా అందరికీ గుర్తుండే ఉంటాయి.

వాటికి తగ్గట్టే ‘గుంటూరు కారం’ కంటే ‘హనుమాన్’ కి బెటర్ టాక్ రావడంతో ‘బుక్ మై షో’ ఇంట్రెస్ట్..ల పై కూడా జనాల ఫోకస్ పడింది. అయితే ఫిబ్రవరి మొదటి వారం రిలీజ్ అవుతున్న సినిమాలను గమనిస్తే.. ప్రేక్షకుల అంచనాలకి భిన్నంగా బుక్ మై ఇంట్రెస్ట్..లు ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే.. సుహాస్ నటించిన ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమా ఫిబ్రవరి 2 న రిలీజ్ కాబోతుంది. దీనిపై కొంత బజ్ ఉంది.

టాక్ పాజిటివ్ గా వస్తే బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేసే ఛాన్సులు ఉన్నాయి. కానీ ఈ సినిమాకి ‘బుక్ మై షో’ లో కేవలం 14.6K ఇంట్రెస్ట్.. లు నమోదవ్వగా… అదే రోజు రిలీజ్ అవుతున్నప్పటికీ అసలు రిలీజ్ అవుతున్నట్టు కూడా చాలా మందికి తెలీని ‘గేమ్ ఆన్’ సినిమాకి 18K ఇంట్రెస్ట్..లు నమోదవ్వడం, అలాగే ‘హ్యాపీ ఎండింగ్’ అనే సినిమాకి ఏకంగా 21.8K ఇంట్రెస్ట్..లు నమోదవ్వడం అందరికీ షాక్ ఇచ్చింది.

దీంతో ‘ ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ (Ambajipeta Marriage Band) సినిమాకి అంత తక్కువ ఇంట్రెస్ట్..లు పడటం ఏంటి?’ … ‘ఇవి ఫేక్’ అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. కానీ ‘ఎ’ సెంటర్ ఆడియన్స్ ని తప్పుదోవ పట్టించడానికి ఈ ‘బుక్ మై షో’ ఇంట్రెస్ట్..లు కారణమయ్యే అవకాశాలు లేకపోలేదు. ‘గుంటూరు కారం’ విషయంలో ఇలా జరగడం వల్లే నైజాం, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో కలెక్షన్స్ బాగా దెబ్బతిన్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus