Mahesh Babu: ఫ్యాన్స్ బాధను స్టార్ ప్రొడ్యూసర్లు అర్థం చేసుకోరా?

మూడు నెలల క్రితం ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయనే సంగతి తెలిసిందే. టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా ఆ సమయంలో థియేటర్లు హౌస్ ఫుల్ కావడంతో పాటు సినిమాలకు రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించాయి. టికెట్ రేట్లు తక్కువగా ఉన్న సమయంలోనే పుష్ప ది రైజ్, అఖండ, భీమ్లా నాయక్ సినిమాలు విడుదలై సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే టికెట్ రేట్లు పెరిగిన తర్వాత మాత్రం పెద్ద సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అవుతున్నాయి.

ఆచార్య సినిమాకు టికెట్ రేట్లు పెంచడం వల్ల భారీస్థాయిలో నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. సర్కారు వారి పాటకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్లను పెంచడానికి అనుమతులు ఇచ్చాయి. టికెట్ రేట్లను తగ్గిస్తే మాత్రమే సర్కారు వారి పాట సినిమా కలెక్షన్లు పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయి. సర్కారు వారి పాట సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చింది.

టికెట్ రేట్లు సాధారణంగా ఉంటే ఈ వీకెండ్ లో సినిమా చూడాలని భావించే వాళ్లకు సర్కారు వారి పాట ఆప్షన్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. మరి సర్కారు వారి పాట మేకర్స్ ఈ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచితే కూడా సర్కారు వారి పాట కలెక్షన్లు మెరుగ్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సర్కారు వారి పాట సినిమాకు 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మైత్రీ మూవీ మేకర్స్ రెగ్యులర్ బయ్యర్లు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారని సమాచారం అందుతోంది. ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి టికెట్ రేట్లను కొనుగోలు చేయడానికి ఫ్యాన్స్ సైతం ఆసక్తి చూపడం లేదు. ఫ్యాన్స్ బాధను స్టార్ ప్రొడ్యూసర్లు అర్థం చేసుకోరా అని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus