Mad Square: ‘మ్యాడ్ స్క్వేర్’ టీం ఆ షాకైతే ఇవ్వదు కదా..!

2023 అక్టోబర్లో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యింది ‘మ్యాడ్’ (MAD) . ఎన్టీఆర్ (Jr NTR) బావమరిది నార్నె నితిన్ (Narne Nithin) ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అలాగే సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) , రామ్ నితిన్ (Ram Nithin)..లు కూడా హీరోలుగా నటించారు. కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) దర్శకుడు. నాగవంశీ (Suryadevara Naga Vamsi) సమర్పణలో సూర్యదేవర హారిక ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మరీ నాగవంశీ చెప్పినట్టు ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu)  రేంజ్ లాభాలు అయితే అందుకోలేదు.

Mad Square

కానీ ఓవరాల్ గా ఈ సినిమా హిట్టే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) రూపొందింది. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా .. కొంచెం ఆలస్యమవడంతో మార్చి 28న రిలీజ్ అవుతుంది. ఉగాదికి రిలీజ్ అయ్యే సినిమాల్లో ‘మ్యాడ్ స్క్వేర్’ పై కొంచెం ఎక్కువ హైప్ ఉంది. హిట్ సీక్వెల్ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి వసూళ్లు సాధించే అవకాశం కూడా ఉంది.

అందుకే పండగ సెలవులు క్యాష్ చేసుకోవడానికి టికెట్ రేట్లు పెంచుకోవాలని నాగవంశీ అండ్ టీం డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా టికెట్ రేట్లు.. ఇప్పుడున్న టికెట్ రేట్ల కంటే రూ.50 , రూ.75 వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఆల్రెడీ ప్రభుత్వానికి చిత్ర బృందం రిక్వెస్ట్ పెట్టుకుందని తెలుస్తుంది. అయితే ‘ ‘మ్యాడ్ స్క్వేర్’ వంటి మిడ్ రేంజ్ సినిమాకి కూడా టికెట్ రేట్లు పెంచుకోవడం అవసరమా?’ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

పెద్ద సినిమాలకి టికెట్ రేట్ల పెంపు వంటివి ఎలాగు తప్పవు. చిన్న సినిమాకు కూడా ఎక్కువ పెట్టాలంటే.. మధ్య తరగతి కుటుంబాలు థియేటర్లకు వెళ్ళడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. మరి చిత్ర బృందం మైండ్లో ఎలాంటి ఆలోచన ఉందో.. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో? అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన అయితే ఏమీ రాలేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus