‘బాహుబలి’ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో ‘ఆర్ఆర్ఆర్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్-ఎన్టీఆర్ లాంటి క్రేజీ కాంబినేషన్ తో దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’పై ఉన్న క్రేజ్ తో ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏపీలో టికెట్ రేట్ ఇష్యూ కొనసాగుతూనే ఉంది. పైగా కరోనా తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పెద్దగా రాబదమ్ లేదు.
దీంతో ఆంధ్రా ఏరియాలో ఈ సినిమా మార్కెట్ విలువను ముప్పై శాతానికి కుదించినట్లు తెలుస్తోంది. ఈస్ట్ ఏరియాను తీసుకుంటే రూ.18 కోట్ల రేషియోలో డీల్ మాట్లాడుకున్నారు. ఇప్పుడు దాన్ని రూ.13 కోట్లకు తగ్గించారట. అటు ఉత్తరాంధ్ర ఏరియా హక్కులను రూ.26 కోట్లకు తీసుకున్నారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.19 కోట్లకు కుదించారు. ఓవరాల్ గా ఆంధ్ర-సీడెడ్ కలిపి రూ.98 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరగ్గా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.68 కోట్లకు తగ్గించుకున్నారు.
నైజాం ఏరియాలో మాత్రం బిజినెస్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఓవర్సీస్ బిజినెస్ విషయంలో చర్చలు సాగుతున్నాయి. ఇక నాన్-థియేట్రికల్ డీల్ విషయంలో ఎలాంటి మార్పు లేదు. 2022 జనవరి 7న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి టీజర్ రాబోతుంది. దీనికి సంబంధించిన ప్రకటనను ఈ నెల 29న అనౌన్స్ చేయనున్నారు.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?