Tiger Nageswara Rao: పెళ్లి అయిన హీరోని పెళ్లి చేసుకున్న టైగర్ నాగేశ్వరరావు హీరోయిన్..!

ఇండస్ట్రీ లో ఉండే హీరో హీరోయిన్స్ పై రూమర్స్ ఉండడం అనేది సర్వసాధారణం. ముఖ్యంగా హీరోయిన్స్ తో అఫైర్స్ ఉన్నట్టుగా పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో అందరిపై ఈ పుకారు ఉండేది. అప్పట్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మీద కూడా ఇలాంటి పుకారు ఉండేది. ఆయన మొదటి సినిమా ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ తో డేటింగ్ చేసాడని , ఇద్దరు రహస్యం గా పెళ్లి చేసుకున్నారు అంటూ ఆరోజుల్లో ఒక రూమర్ సెన్సేషన్ సృష్టించింది.

అయితే ఈ రూమర్ పై రామ్ చరణ్ వెంటనే స్పందించి అలాంటిదేమి లేదు, పెళ్లి అనేది నేను ఇంట్లో చెప్పే చేసుకుంటాను, నేహా శర్మ నాకు కేవలం ఒక స్నేహితురాలు మాత్రమే అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆయన ఉపాసన ని పెళ్లి చేసుకొని అద్భుతమైన సంసార జీవితం ని గత 12 ఏళ్ళు గా కొనసాగిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

ఉపాసన తో పెళ్లి జరిగిన తర్వాత రామ్ చరణ్ మీద ఇప్పటి వరకు ఒక్క రూమర్ కూడా రాలేదు. కానీ రీసెంట్ గా గాయత్రీ భరద్వాజ్ అనే యంగ్ హీరోయిన్ రామ్ చరణ్ నాకు భర్త అంటూ మీడియా ముందుకు వచ్చింది. ఈమె రీసెంట్ గా మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం లో ఒక హీరోయిన్ గా నటించింది. ఈమె నటనకి మంచి మార్కులే పడ్డాయి.

అయితే ఈ సినిమా (Tiger Nageswara Rao) ప్రొమోషన్స్ సమయం లో ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే ఇదంతా ఆమె సీరియస్ గా మాట్లాడింది అని అనుకుంటున్నారేమో, కంగారు పడకండి, ఆమె సరదాగానే మాట్లాడింది. రామ్ చరణ్ అంటే నాకు చాలా ఇష్టమని, అతను నా క్రష్ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. రామ్ చరణ్ కి పెళ్లి అయిపోయింది అని యాంకర్ అనగా, అప్పుడు గాయత్రీ గుప్తా నా ఊహల్లో రామ్ చరణ్ తో నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది అంటూ సమాధానం ఇచ్చింది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus