Tiger Nageswara Rao: మినీ థియేటర్లో టైగర్ నాగేశ్వరరావు కి దక్కని రెస్పాన్స్..!

టాలీవుడ్ మాస్ మహారాజ రవి తేజ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిల్చిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుండే ఈ సినిమాకి ఆశించిన రేంజ్ టాక్ రాలేదు. కొంతమంది పర్వాలేదు అని చెప్తే, మరికొంత మంది చాలా చెత్తగా ఉంది అని చెప్పుకొచ్చారు. సినిమా స్టోరీ బాగానే ఉన్నప్పటికీ దర్శకత్వ పరిణీతి లేకపోవడం ఈ చిత్రం లో స్పష్టం గా కనిపించింది.

కానీ దసరా సీజన్ అవ్వడం తో కనీసం పది కోట్ల షేర్ అయినా చేస్తుందా అని అనుకున్న ఈ సినిమా, ఏకంగా 28 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. ప్రీ రిలీజ్ బిజినెస్ 38 కోట్ల రూపాయలకు జరగగా, 9 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది. రీసెంట్ గానే ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేసారు. థియేటర్స్ లో అనుకున్న రేంజ్ ఓపెనింగ్స్ రాకపోయినా, ఓటీటీ లో మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకున్నారు.

కానీ పట్టుమని రెండు రోజులు కూడా ఇండియా వైడ్ ట్రెండింగ్ అవ్వలేకపోయింది ఈ చిత్రం. మొన్న బాలయ్య బాబు ‘భగవంత్ కేసరి’ చిత్రం అప్లోడ్ చెయ్యగానే ‘టైగర్ నాగేశ్వర రావు’ ట్రెండింగ్ నుండి వెళ్ళిపోయింది. ఇంత చెత్త రెస్పాన్స్ ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ హీరో సినిమాకి కూడా రాలేదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

థియేట్రికల్ పరంగా మాత్రమే కాకుండా, ఓటీటీ లో కూడా ఈ సినిమా బయ్యర్స్ కి భారీ నష్టాలను కలిగించింది అనే చెప్పాలి. మూడు నెలల క్రితం విడుదలైన ‘జైలర్’ చిత్రం ఇంకా ఇండియా వైడ్ ట్రెండ్ అవుతుంది, అలాంటిది ‘టైగర్ నాగేశ్వర రావు’ (Tiger Nageswara Rao) ట్రెండింగ్ నుండి వెళ్ళిపోయింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత చెత్త రెస్పాన్స్ వచ్చింది అనేది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus