‘ఏ‌బి‌సి‌డి3’ లో టైగర్ ష్రోఫ్ .. ?

వరుణ్ ధావన్, శ్రద్దా కపూర్ లు జంటగా తెరకెక్కిన చిత్రం ఏ‌బి‌సి‌డి 2. ఏ‌బి‌సి‌డి చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కగా.. ఇప్పుడు ఏ‌బి‌సి‌డి సిరీస్ లో మరో చిత్రం రానుందని అంటున్నారు. రెమో డిసౌజా తెరకెక్కించనున్న ఈ చిత్రంలో వరుణ్ స్థానంలో టైగర్ ష్రోఫ్ నటించనున్నాడని సమాచారం.

ప్రస్తుతం టైగర్ ష్రోఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ల తో కలిసి రెమో ‘ఏ ఫ్లయింగ్ జట్ట్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత అజయ్ దేవగణ్, సూరజ్ పాంచాలి లతో కలిసి ఓ డాన్స్ యాక్షన్ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఆ తరువాత ఏ‌బి‌సి‌డి3 సెట్స్ పైకి వెళ్లనుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus