బాగోలేదన్న సినిమాతో బంపర్ హిట్ కొట్టిన టైగర్

అప్పటికే ‘పరుగు, వర్షం’ సినిమాలను రీమేక్ పేరుతో నాశనం చేశాడనే అపవాదు టైగర్ మీద ఉంది. ‘భాగీ’ 2 ట్రైలర్ చూసిన తర్వాత ‘ఇది క్షణం రీమేకా?’ అంటూ షాకైనా వారైతే కోకొల్లలు. కానీ.. విచిత్రంగా ‘వర్షం, పరుగు’ సినిమా రీమేకులు విజయం సాధించినడానికంటే భారీ స్థాయిలో “క్షణం” రీమేకైన “భాగీ 2” హిట్ అయ్యింది. సినిమా విడుదలై మొదటి షోకి విపరీతమైన నెగిటివ్ టాక్ ఏర్పడింది. సినిమా మొత్తం ఫైట్స్ తప్ప మరేమీ లేవని, మాస్ ఆడియన్స్ తప్ప ఎవరూ ఈ సినిమా ఎంజాయ్ చేయలేరని విశ్లేషకులు పేర్కొన్నారు.

ఒక వర్గం ప్రేక్షకులు-విమర్శకులు పెద్దగా బాలేదని తేల్చేసిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులేమో “మంచి సినిమాని చెడగొట్టాడు” అని కామెంట్ చేశారు. అయితే.. వీటితో సంబంధం లేకుండా “భాగీ 2” బంపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. మొదటివారంలో 100 కోట్ల గ్రాస్ సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ విజయానికి కారణం బి,సి సెంటర్స్ అని ట్రేడ్ పండిట్స్ పేర్కొంటున్నారు. సదరు సెక్టర్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి అవసరమైన ఫైట్స్, ఐటెమ్ సాంగ్ ఉండడంతో సినిమా టాక్ తో సంబంధం లేకుండా కోట్లు కలెక్ట్ చేస్తుంది. గతంలోనూ టైగర్ నటించిన సినిమాలకి ఇదే తరహాలో టాక్ వచ్చింది. కానీ.. ఆ సినిమాలు కూడా వంద కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకొన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus