King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున తన వందో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. వీకెండ్‌లో ఒక రోజు రెండు రోజుల బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌ని షూట్‌ చేసి.. కంగారు కంగారుగా రెడీ చేస్తున్నది కూడా అందుకే అని అంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమాను ఎలాగైనా డిసెంబరు 24న విడుదల చేయాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తోంది. ఈ మేరకు డబుల్‌ షిఫ్ట్‌లు కూడా చేసి సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారట.

King 100

సినిమా పనులు అలా సాగుతుంటే.. మరోవైపు సినిమా టైటిల్‌ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అదేంటి ఇప్పటికే ‘కింగ్‌ 100’ అని పేరు పెట్టారు కదా అని అంటారా. అవును ఆ పేరు పెట్టడం నిజమే, ఆ పేరు పెట్టడానికి కారణం ఇదే అంటూ సినిమా సన్నిహిత బృందం బయటకు చెప్పడమూ నిజమే. అయితే ఏమైందో ఏమో ఇప్పుడు సినిమా టైటిల్‌ని మార్చాల్సిందే అని ఫిక్స్ అయ్యారట. ఈ సినిమాకి ‘ఖైదీ 100’ అనే కొత్త టైటిల్ అనౌన్స్ చేస్తున్నారని టాక్‌.

సినిమాకు ‘కింగ్ 100’ అనే పేరు పెట్టడానికి కారనం ఉంది అంటూ ఆ మధ్య చిత్ర సన్నిహిత బృందం నుండి లీకులు వచ్చాయి. ఆ సీన్స్‌ చూశాక ఎందుకు సినిమాకు ఈ టైటిల్‌ పెట్టారో అర్థమైపోతుంది అంటూ ఊరించారు కూడా. కానీ ఇప్పుడు చూస్తే ఆ పేరు కంటే ‘ఖైదీ 100’ అనే పేరు ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నారట. అందుకే ‘ఖైదీ 100’ అని పేరు పెట్టి #KING100 అనే దానిని హ్యాష్‌ట్యాగ్‌గా పెడతారట.

మరి, ఈ కొత్త పుకార్ల నేపథ్యంలో చిత్రబృందం ఏమన్నా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. నిజానికి కింగ్‌ 100 పేరు బాగానే ఉంది. మరి దర్శకుడు రా.కార్తిక్‌ మనసులో ఏముందో ఆయనే చెప్పాలి. అన్నట్లు సినిమా రిలీజ్‌ల గురించి ఆ మధ్య నాగార్జున చేసిన కామెంట్ల నేపథ్యంలోనే ఈ సినిమా టైమ్‌కి రావాల్సిందే అని ఫిక్స్‌ అయ్యారట. ఆ మధ్య సినిమాలు అనుకున్న డేట్‌కి ఎందుకు తేవడం లేదు అని నాగార్జున ‘లెనిన్‌’ టైమ్‌లో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus