నాగార్జున-ఆర్జీవిల సినిమా టైటిల్ ఫిక్స్

2018లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రోజెక్ట్స్ లో కీలకమైనది నాగార్జున హీరోగా రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్. ‘అంతం’ తర్వాత ఆర్జీవి-నాగార్జున కాంబినేషన్ లో దాదాపు 25 ఏళ్ల విరామం అనంతరం తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎనౌన్స్ మెంట్ మొదలుకొని భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా నాగార్జున ఓల్డ్ & సాల్ట్-పెప్పర్ లుక్, సిక్స్ ప్యాక్ బాడీ చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు. నాగార్జున-ఆర్జీవిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ నాలుగో చిత్రానికి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలిసింది.

అదేంటంటే.. ఈ సినిమాకి “శపధం” అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారట. తొలుత “సిస్టమ్” అనే టైటిల్ అనుకొన్నప్పటికీ సినిమా కాన్సెప్ట్ మరియు కథనానికి “శపధం” అయితే బాగుంటుందని భావించి ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ.. వర్మ మాత్రం ప్రత్యేకమైన శ్రద్ద తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. యంగ్ హీరోస్ సైతం తనను నమ్మలేకపోతున్న తరుణంలో కథానాయకుడిగా పీక్ స్టేజ్ లో ఉన్న నాగార్జున తనకు పిలిచి మరీ ఆఫర్ ఇవ్వడంతో వర్మ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టలాన్న ధృడ నిశ్చయంతో ఉన్నాడు వర్మ. సో ఒక రకంగా చెప్పాలంటే.. ఇది రాంగోపాల్ వర్మ “శపధం”.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus