నాన్న నాగార్జున టైటిల్ ను అరువు తీసుకుంటున్న అఖిల్!

అక్కినేని కుటుంబ వారసత్వం ఉంది. తాతయ్య ఏయన్నార్ ఆశీర్వాదం, తండ్రి నాగార్జున భుజబలం, అన్నయ్య నాగచైతన్య సహకారం పుష్కలంగా ఉన్నప్పటికీ.. ఇప్పటివరకూ కథానాయకుడిగా తనను తాను నిరూపించుకోలేకపోయాడు అక్కినేని అఖిల్. పరిచయం చిత్రం డిజాస్టర్ అయినా ఢీలాపడలేదు, రెండో సినిమా సరిగా ఆడకపోయినా బెదిరిపోలేదు.

ఆ చిత్రాలతో విశేషమైన అనుభవం సంపాదించుకొని ఇప్పుడు మూడో చిత్రంతో ప్రేక్షకులను సరికొత్తగా పలకరించేందుకు రెడీ అవుతున్నాడు అక్కినేని అఖిల్. “అఖిల్, హలో” సినిమాల తర్వాత “తొలిప్రేమ”తో దర్శకుడిగా మారిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు సన్నద్ధమయ్యాడు. భోగవల్లి ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం కూడా యూత్ ఫుల్ లవ్ స్టోరీయే. లండన్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ లవ్ స్టోరీలో అఖిల్ ఎన్నారైగా నటించనున్నాడు. “సవ్యసాచి”తో తెలుగు తెరకు పరిచయమవుతున్న నిధి అగర్వాల్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి “మిస్టర్ మజ్ను” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

“మజ్ను” అనే టైటిల్ తో తండ్రి నాగార్జున ఒక సినిమా చేసి ఉండడంతో ఆ సెంటిమెంట్ ప్రకారం అయినా మూడో సినిమా హిట్ అవుతుందేమోనని అఖిల్ ఆశ. మరి ఈ మూడో చిత్రంతోనైనా అఖిల్ కథానాయకుడిగా తన స్టామినాను బాక్సాఫీస్ వద్ద నిరూపించుకొంటాడో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus