మహేష్ – అనిల్ రావిపూడి చిత్రం టైటిల్ అదే..?

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ‘మహర్షి’ చిత్రం మే 9 న విడుదల కాబోతున్న తెలిసిందే. ఇది మహేష్ కు 25 వ చిత్రం కావడం విశేషం. ఇక తన 26 వ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయడానికి రెడీ అవుతున్నాడని చాలా రోజులుగా టాక్ నడుస్తుంది. దిల్ రాజు, అనిల్ సుంకర కలిస నిర్మించబోతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించనున్నాడట. హీరోయిన్లుగా రష్మిక మందన, అదితి రావు హైదరి నటించబోతున్నారని తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రానికి సంబందించిన ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.. అయినప్పటికీ ఈ చిత్రం టైటిల్, మరియు మహేష్ బాబు పాత్ర పేరు ఇదేనంటూ ఓ వార్త ప్రస్తుతం ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది.

అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో మహేష్ క్యారెక్టర్ పేరు అజయ్ జోసఫ్ అంట. అలాగే సినిమా టైటిల్ ..’సరిలేరు నీకెవ్వరు’ అని తెలుస్తుంది. ఈ చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి ఓ కీలక పాత్ర పోషిస్తుండగా జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడు. విజయశాంతి పాత్ర చుట్టూనే ఈ కథ తిరుగుతుందని సమాచారం. మహేష్ బాబు, జగపతి బాబు మధ్య వచ్చే సీన్లు మహేష్ అభిమానులతో పాటూ.. కమర్షియల్ ఆడియన్స్ ను కూడా బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తుంది. 2020 సంక్రాంతి టార్గెట్ గా ఈ చిత్రాన్ని అందించాలని చిత్ర యూనిట్ ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus