మహేష్-మురుగదాస్ ల సినిమా టైటిల్ అదేనా?

శ్రీమంతుడిలా అందరికి సాయపడే సూపర్ స్టార్ మహేష్ బాబు ఎందుకు ఎనిమి అయ్యాడు అనుకుంటున్నారా?.. ప్రిన్స్ ఎప్పుడు హీరోనే. కానీ సంఘాన్ని పీడించే ద్రోహులకే శత్రువుగా మారాడు . న్యాయ వ్యవస్థలోని లొసుగుల్ని ఆసరాగా చేసుకుని తప్పించుకుని తిరుగుతున్న కొంతమంది భరతం పట్టేందుకు మహేష్ బాబు ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ అవతారం ఎత్తాడు. తమిళ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఆయన పోషిస్తున్న పాత్ర ఇదే. ఈ సినిమాకు ఏ పేరు పెట్టాలా ? అని డైరక్టర్ బృందం తెగ ఆలోచిస్తోంది. తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఒకే టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తోంది.

అయితే ఈ చిత్రానికి పేరు ఖరారు అయినట్లు తెలిసింది. “ఎనిమి” పేరు కథకు కరక్ట్ గా సూట్ అవుతుందని భావించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దసరాకు విడుదల కానున్న ఫస్ట్ లుక్ లో ఈ పేరును కూడా రివీల్ చేయాలనీ నిర్మాత ఠాగూర్ మధు సన్నాహాల్లో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.  గతనెల నగరంలో  ప్రారంభమైన ఈ చిత్ర మొదటి షెడ్యూల్ విజయవంతగా ముగిసింది. ఈ చిత్రీకరణలో ప్రిన్స్ తో పాటు ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా పాల్గొంది. ఈ మూవీ రెండో షెడ్యూల్ ఈ నెల 22 న మొదలుకానుంది. ఇందుకోసం సినీ బృందం చెన్నై కు బయలు దేరనుంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus