Prabhas, Maruti: ప్రభాస్‌ – మారుతి సినిమా పేరు ఫిక్స్‌.. ఇన్నాళ్లూ చెప్పింది కాదట!

ప్రభాస్‌ – మారుతి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోందట. అదేంటి ఈ వార్త కన్‌ఫామ్‌ కదా.. మళ్లీ ‘అట’ అంటున్నారేంటి అని అనుకుంటున్నారా? ఉందీ.. కారణం ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఒకటి ఉన్నట్లు ఇప్పటివరకు టీమ్‌ ఎక్కడా చెప్పడం లేదు. చెప్పడానికి ప్రభాస్‌ మీడియా ముందుకు రావడం లేదు. దర్శకుడు మారుతి అయితే చెబుతా అంటున్నారు. నిర్మాత అయితే దానికో లెక్కుండి అప్పుడు చెబుతా అంటున్నారు. అయితే ఇలా ఇంకా అఫీషియల్‌గా కన్‌ఫామ్‌ కాని ఈ సినిమాకు పేరు పెట్టేశారట.

ఇందులో కొత్త వార్తేముంది… ఎప్పుడో అన్నారు కతా ‘రాజా డీలక్స్‌’ అని మీరు అనొచ్చు. ఇది కూడా నిజమే అయితే టీమ్‌ మాత్రం ఈ పేరును ఫైనల్‌ చేయలేదు. చెబుతాం.. చెబుతాం, అవ్వొచ్చు కాకపోవచ్చు అంటూ నానుస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ పేరు కాకుండా మరో పేరును తీసుకున్నారట. అయితే ఇప్పుడు కూడా ఒక పేరు ఫైనల్‌ కాలేదు. ఫైనల్‌ చర్చల్లోకి రెండు పేర్లు వచ్చాయట. వాటిలో ఒకటి ఫైనల్‌ చేసి త్వరలో అనౌన్స్‌ చేస్తారట. దీని కోసం చూచాయగా ఓ ముహూర్తం కూడా అనుకున్నారట.

అదే ‘సలార్‌’ రిలీజ్‌ తర్వాత. ‘ఆదిపురుష్‌’ ఎఫెక్ట్‌ నుండి ప్రభాస్ కానీ, అతని అభిమానులు కాని బయటకు రావాలంటే సలార్‌ రావాల్సిందే. సెప్టెంబరు ఆఖరి వారంలో ఈ సినిమా వస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజుల గ్యాప్‌లోనే మారుతి సినిమా తీసుకొచ్చేస్తారట. ఎందుకంటే ‘ప్రాజెక్ట్‌ కె’ కూడా వెనుక ఉంది. అందుకే ప్లానింగ్‌ జరుగుతోందట. ఈ విషయంలో క్లారిటీ వస్తే త్వరలో సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్‌ చేస్తారట. అది చాలా ‘రాయల్‌’గా ఉండేలా చూసుకుంటున్నారట.

టాలీవుడ్‌లో పాన్‌ ఇండియా సినిమాలకు ‘అంబాసిడర్‌’ అయిన (Prabhas) ప్రభాస్‌ నుంచి ఇటీవల కాలంలో వస్తున్న చిన్న సినిమా ఇదే అవ్వొచ్చు. అంతా చెబుతున్నారు టైటిల్‌ చెప్పలేదేంటి అనుకుంటున్నారా? మీరు ఇప్పటివరకు చదివిన వార్తలోనే ఆ రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి ‘రాయల్‌’ అయితే, రెండోది ‘అంబాసిడర్‌’. సినిమాలో ప్రభాస్‌ పాత్రకు తగ్గట్టుగా ఈ పేర్లు అనుకున్నారట. అయితే ‘రాయల్’ అనే టైటిల్ పైనే ఆసక్తి ఎక్కువగా ఉందట టీమ్‌లో. మరి ఏది ఫైనల్‌ చేస్తారో చూడాలి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus