విజయ్ సినిమాపై డాక్టర్ల ఆగ్రహం!

ఇప్పటివరకూ ఏదైనా సినిమా ఒక పర్టిక్యులర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కో లేక వర్గానికో నచ్చకపోతే సినిమాను థియేటర్ నుండి తీసేయాలనో లేక వారికి ఇబ్బందికరంగా ఉన్న సన్నివేశాలను డిలీట్ చేయాలనో కోరతారు. కానీ.. విభిన్నంగా విజయ్ తాజా చిత్రం “మెర్సల్”ను మాత్రం “ఆన్ లైన్”లో పైరసీ చేస్తాం అంటూ బెదిరిస్తున్నారు. అలా బెదిరిస్తున్నది యాంటీ ఫ్యాన్సో లేక ఆన్ లైన్ పైరసీదారులో కాదు బాగా చదువుకున్న డాక్టర్లు. అసలు “మెర్సల్”సినిమాను డాక్టర్లు ఎందుకు పైరసీ చేయాలనుకొంటున్నారంటే.. “మెర్సల్” మూవీలో డాక్టర్ల వృత్తిని, డాక్టర్ల వ్యక్తిత్వాన్ని, హాస్పిటల్ విధానాన్ని చెడుగా చూపించారట. అందుకే సినిమాను ఎలాగైనా బ్రష్టు పట్టించాలని నిశ్చయించుకొన్నారట.

“మెర్సల్” మూవీలో డాక్టర్స్ మరియు హాస్పిటల్ వ్యవస్థపై నిప్పులు చెరిగాడు దర్శకుడు అట్లీ. అదే విధంగా జి.ఎస్.టి విధానంపై కూడా వ్యతిరేకత్వాన్ని తెలిపాడు. ఆల్రెడీ ఈ విషయమై తమిళనాడు అసెంబ్లీ లో రచ్చ జరుగుతోంది. ఈ రచ్చ పుణ్యమా అని సినిమాకి లభిస్తున్న పబ్లిసిటీ కంటే సినిమాకు జరుగుతున్న నష్టమే ఎక్కువ. వచ్చేవారం (అక్టోబర్ 27) విడుదలవుతున్న ఈ చిత్రం తెలుగులో ఏమేరకు విజయం సాధిస్తుందో చూద్దాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus